Rajinikanth Speech : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా కూలీ. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. కేవలం రజినీకాంత్ మాత్రమే కాకుండా అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు కూడా ఈ సినిమాలో కనిపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ లో రజనీకాంత్ స్పీచ్ అందరిని ఆకట్టుకోవడమే కాకుండా విపరీతంగా నవ్వించింది.
రజనీకాంత్ స్పీచ్
ఈ సినిమా గురించి రజనీకాంత్ మాట్లాడుతూ… నాగార్జున అమీర్ ఖాన్ ఇంటర్వ్యూ రియల్లీ సినిమాకి ఒక హైప్ తీసుకొచ్చాయి. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఒక ఇంటర్వ్యూ రెండు గంటల పది నిమిషాలు ఇచ్చాడు. నేను ఆ ఇంటర్వ్యూ చూశాను. అది అవుతూనే ఉంది. నిలుచున్నాను, కూర్చున్నాను, చుట్టూ కాసేపు తిరిగి వచ్చాను. ఇంకా ఇంటర్వ్యూ జరుగుతూనే ఉంది. తర్వాత నేను పడుకున్నాను, మళ్లీ లేచాను, ఏం జరుగుతుందో గెస్ చేయండి. ఆ ఇంటర్వ్యూ ఇంకా జరుగుతూనే ఉంది.
ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన గిరీష్ గంగాధరన్ మోస్ట్ హ్యాండ్సం కెమెరామెన్. వెరీ క్వైట్ అండ్ క్లామ్ టెక్నీషియన్. లోకేష్ కి అతనికి మంచి ర్యాపో ఉంటుంది. మంచి మూడ్ క్రియేట్ చేయడానికి, షాట్స్ ఫ్రేమ్ పెట్టడానికి & సీక్వెన్సెస్ వాళ్ళు బాగా డిస్కస్ చేస్తారు. ఎడిటర్ పిలోమోనీరాజ్ డైరెక్టర్ లోకేష్ థాట్ ని అర్థం చేసుకొని ఎడిట్ చేస్తాడు. స్టంట్ మాస్టర్ హైలీ అప్డేటెడ్. ఆయనతో కబాలి సినిమాకు పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది.
కొరియోగ్రాఫర్ సాండి నా దగ్గరికి వచ్చి ఫస్ట్ సాంగ్ అదరగొడదాం అన్నాడు. నేను 1950 మోడల్, ఆల్రెడీ లక్షల కిలోమీటర్లు తిరిగేసాను. పార్ట్స్ యూస్ అయిపోయాయి, చేంజ్ కూడా అయిపోయాయి. ఒత్తిడి తీసుకురాకుండా నన్ను చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయని చెప్పాను.
అంటూ అందరిని ఆకట్టుకోవడమే కాకుండా మంచి ఫన్ క్రియేట్ చేశారు.
Also Read: Megastar Chiranjeevi: స్టేజ్ పై స్టెప్పులు అదరగొట్టిన మెగాస్టార్ చిరంజీవి, ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్