BigTV English
Advertisement

Thalaivasal Vijay : ఈ నటుడి ఇద్దరు అల్లుళ్లు క్రికెటర్లే.. ఐపీఎల్ లో కూడా ఆడిన ఆ ఆటగాళ్లు ఎవరో తెలుసా?

Thalaivasal Vijay : ఈ నటుడి ఇద్దరు అల్లుళ్లు క్రికెటర్లే.. ఐపీఎల్ లో కూడా ఆడిన ఆ ఆటగాళ్లు ఎవరో తెలుసా?

Thalaivasal Vijay :  సినీ ఇండస్ట్రీలో  తలైవాసల్ విజయ్ అంటే ఇండస్ట్రీ వారు గుర్తు పట్టొచ్చు. కానీ సాధారణ పౌరులు, క్రీడాకాలు, రాజకీయ నాయకులు  అంతగా ఎవ్వరూ గుర్తు పట్టరు. కానీ అతను ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, భాషల్లో అనేక భాషల్లో నటించి మెప్పించారు. 1990 దశకంలో పవర్ పుల్ పాత్రలతో జనాలకు దగ్గరయ్యారు. 1992లో విడుదలైన తలైవాసల్ తో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. దీంతో తన ఫస్ట్ మూవీ పేరునే తన ఇంటిపేరుగా మార్చుకొని తలైవాసల్ విజయగ్ గా మారారు. ఆ తరువాత తమిళంలో ఆయనకు వరుస అవకాశాలు వచ్చాయి. ఏడాదికి అరడజన్ కి పైగా నటిస్తూ సీనియర్ నటుడిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.


Also Read : WCL 2025 : సెమీస్ లో భారత్-పాక్ మ్యాచ్ మళ్లీ రద్దు అవుతుందా..? పాక్ ఫైనల్ కి ఖాయమా..?

చెన్నై జట్టులో 5 సీజన్లలో సభ్యుడు 


1995లో వచ్చిన స్త్రీ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో కథానాయకుడిగా కనిపించారు. ఆ తర్వాత నాయకుడు, కేక, మరో చరిత్ర ఇలా పలు ల్లో నటించి మెప్పించారు. నాగార్జున నటించిన గగనం తో ఆయనకు తెలుగులో బ్రేక్ వచ్చింది. తెలుగులో భాగమతి, యాత్ర, రాధేశ్యామ్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి చిత్రాల్లో కనిపించారు. ఇప్పటికీ వరుస ల్లో నటిస్తున్నారు. అయితే విజయ్ కు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు జయవీణ స్విమ్మర్. నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగిన దక్షిణాసియా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ లో ఆమె గెలిచింది. ఇండియాలో అత్యంత వేగవంతమైన స్విమ్మర్ టైటిల్ సైతం సొంతం చేసుకుంది. ఇక ఆమె భర్త బాబా అపరాజిత్ తమిళనాడు క్రికెట్ జట్టుకు మెయిన్ ప్లేయర్. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఐదు సీజన్లలో సభ్యుడిగా ఉన్నారు. కానీ ఒక్క మ్యాచ్ ఆడే ఛాన్స్ రాలేదు.

కోల్ కతా వికెట్ కీపర్ గా 

ఇక అతడి తమ్ముడు బాబా ఇంద్రజిత్ సైతం క్రికెటర్ కావడం విశేషం. 2022లో ఇండియన్ ప్రీమియర్ లీక్ టోర్నమెంట్ కోసం జరిగిన వేలంలో అతడిని కోల్ కత్తా నైట్ రైడర్స్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా కొనుగోలు చేసింది. దీంతో ఈ ఆటగాళ్ల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఒకవేళ ఐపీఎల్ లో వీరు పరిచయం ఉన్నా.. కానీ వీరి మామ తలైవాసల్ విజయ్ అని చాలా తక్కువ మందికి తెలుసు. ఇలా చాలా మంది క్రీడాకారులు తమ ఫ్యామిలీలో పొలిటికల్, లేదా సినీ ఇండస్ట్రీ, స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికి రిలేటివ్స్ గా ఉంటున్నారు. అది వారు చెప్పేంత వరకు కూడా తెలియడం లేదు. తాజాగా ఈ క్రికెటర్లు సోషల్ మీడియాలో వైరల్ అయితే తప్ప.. పెద్దగా తెలియదు. ఇలా తెలియని వారు చాలా మందే ఉన్నారు.

Tags

Related News

World Cup 2025: RCB చేసిన పాపం.. టీమిండియా మ‌హిళ‌ల‌కు త‌గులుతుందా, సెల‌బ్రేష‌న్స్ లేకుండానే ?

Virat Kohli: 6 గురు అమ్మాయిల‌తో విరాట్ కోహ్లీ ఎ**ఫైర్లు..లిస్ట్ రోహిత్ శ‌ర్మ భార్య కూడా ?

Sara -Shubman Gill: బ‌ట్ట‌లు విప్పి చూపించిన గిల్‌…బిల్డ‌ప్ కొట్ట‌కు అంటూ సారా సీరియ‌స్!

Hardik Pandya: ప్రియురాలి కారు కడుగుతున్న హార్దిక్ పాండ్యా…ముద్దులు పెడుతూ మ‌రీ !

Haris Rauf: హారిస్ రవూఫ్ పై ICC బ్యాన్..సూర్య‌కు కూడా షాక్‌

RCB: బెంగ‌ళూరుకు కొత్త కోచ్‌..WPL 2026 టోర్న‌మెంట్‌, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం

Womens World Cup 2025: హ‌ర్ధిక్ పాండ్యాను కాపీ కొడుతున్న లేడీ బుమ్రా

PM Modi: వరల్డ్ కప్ విజేతలకు PM మోడీ బంపర్ ఆఫర్.. డైమండ్ నెక్లెస్​ల బహుమతి!

Big Stories

×