Ravindra Jadeja : ప్రస్తుతం టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్ లోని ఓవల్ వేదికగా ఐదో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. తొలి ఇన్నింగ్స్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు 224 పరుగులకు ఆలౌట్ అయింది. అదేవిధంగా ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ 247 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 396 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 374 పరుగుల టార్గెట్ ను ఇంగ్లాండ్ ఛేదించాలి. 9 వికెట్లు తీస్తే.. టీమిండియా విజయం సాధిస్తుంది. లేదంటే ఇంగ్లాండ్ జట్టు 374 పరుగులు చేస్తే.. ఇంగ్లాండ్ విజయం సాధిస్తుంది. ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
షర్ట్ మార్పించిన జడేజా
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతనికి ఎదురుగా ఒక ఇంగ్లాండ్ అభిమాని రెడ్ టీ షర్ట్ వేసుకొని మ్యాచ్ ని వీక్షిస్తున్నాడు. దీంతో రెడ్ టీ షర్ట్ వేసుకోవడంతో జడేజాకి కాస్త డిస్టబెన్స్ అయింది. ఎదురుగా కూర్చోవడంతో కళ్లకు ఎఫెక్ట్ పడుతుందనే కారణంతో జడేజా కోరిక మేరకు అతనికి టీ షర్ట్ మార్చారు. ఎంపైర్ ఫోన్ చేసి అక్కడ ఉన్న సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి అతనికి టీ షర్ట్ మార్చోకోవాలని సూచించారు. దీంతో అతను వెంటనే అబ్జెక్షన్ చెప్పకుండా రెడ్ టీ షర్ట్ మీదుగా వాళ్లు ఇచ్చిన టీషర్ట్ ను వేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇదిలా ఉంటే.. టీమిండియా నిర్దేశించిన 374 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదిస్తుందా..? లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠ గా మారింది.
ఆల్ రౌండర్లు అదుర్స్
టీమిండియా కి చెందిన నలుగురు ఆల్ రౌండర్లలో ఒకరినీ తగ్గించి మరో బ్యాటర్ నో.. బౌలర్ నో తీసుకుంటే బాగుండేది అని చాలా మంది క్రికెట్ అభిమానులు పేర్కొన్నారు. కొందరూ మాజీ క్రికెటర్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మన స్పిన్ ఆల్ రౌండర్లు ఆపద్భాందవులు అయ్యారు. జడేజా అయితే సిరీస్ తొలి టెస్ట్ నుంచి ఇలాగే ఆడుతున్నాడు. అన్ని టెస్ట్ ల్లో కూడా జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా కీలకంగా మారాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ 118, రాహుల్ 07, సాయి సుదర్శన్ 11, ఆకాశ్ దీప్ 11, శుబ్ మన్ గిల్ 11, కరుణ్ నాయర్ 17, జడేజా 53, వాషింగ్టన్ సుందర్ 53, ధ్రువ్ జురెల్ 34 బ్యాటింగ్ లో రాణించడంతో టీమిండియా 396 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ కి 374 పరుగులను లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. క్రాలీ 14, డకెట్ 54, పోప్ 27 పరుగులు చేసి ఔట్ అయ్యారు. రూట్ 52, బ్రూక్ 81 పరుగులు చేసి క్రీజులో పాతుకుపోయారు. 52 ఓవర్లకు ఇంగ్లాండ్ జట్టు 239 పరుగులు చేసింది. కేవలం 135 పరుగులు చేసినట్టయితే ఈ సిరీస్ ను కైవసం చేసుకుంటుంది
ఇంగ్లాండ్ జట్టు. టీమిండియా 6 వికెట్లు తీస్తుందో.. లేక ఇంగ్లాండ్ 135 పరుగులు చేస్తుందో వేచి చూడాలి మరీ.
?igsh=MXA5bTBoc2VtMGV2aw==

Share