BigTV English

Ishan Kishan : ఇషాన్ కిషన్ డిప్రెషన్ లో ఉన్నాడా..? కెరీర్ ప్రమాదంలో పడిందా..?

Ishan Kishan : ఇషాన్ కిషన్ డిప్రెషన్ లో ఉన్నాడా..? కెరీర్ ప్రమాదంలో పడిందా..?

Ishan Kishan : యువ ఓపెనర్, వికెట్ కీపర్ అయిన ఇషాన్ కిషన్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. తనిప్పుడు డిప్రెషన్ లో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ సెలక్షన్ కమిటీ దృష్టిలో పడాలంటే రంజీ ట్రోఫీలు ఎంతో మేలు చేస్తాయనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ టీమ్ ఇండియా జట్టులో కీలకంగా ఉండి కూడా స్థానం కోల్పోతున్న ఇషాన్ కిషన్ అక్కడ కూడా ఆడటం లేదు.


వన్డేలో అతి తక్కువ బాల్స్ లో డబుల్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఇషాన్ కిషన్ ఆకర్షించాడు. ఆ సమయంలో కేఎల్ రాహుల్ కి ప్రత్యామ్నాయంగా ఉండేవాడు.11 మందిలో లేకున్నా, జట్టులో మాత్రం ఉండేవాడు. అలా ఫైనల్ లిస్ట్ లో ఎవరు తగ్గినా తనకే అవకాశమిచ్చారు. అలా వన్డే వరల్డ్ కప్ లో శుభ్ మన్ గిల్ ఆడని మ్యాచ్ ల్లో తనే ఆడాడు.

కానీ వచ్చిన అవకాశాలను జారవిడుచుకుంటూ వెళ్లాడు. తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్ లో మెరిసినా మళ్లీ బ్రేకులు పోయిన బండిలా మారిపోయాడు.నిలకడలేమి తనని ఇబ్బంది పెడుతోంది. దీంతో టీమ్ ఇండియా ప్రత్యామ్నాయాల వైపు చూసింది.


ఈ సమయంలో జితేశ్ శర్మ ప్రత్యామ్నాయం కనిపించాడు. తర్వాత సంజూ శాంసన్ వచ్చాడు. ఈ సమయంలో ఇషాన్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లాడు.టెస్ట్ మ్యాచ్ లు ఆడకుండానే, రెస్ట్ కావాలంటూ వెనక్కి వచ్చేశాడు.

ఇప్పుడు ఆఫ్గాన్ తో టీ 20 సిరీస్ కి ఎంపిక కాలేదు. రేపు టీ 20 ప్రపంచకప్ సమయానికి రిషబ్ పంత్ వస్తే, ఇప్పుడున్న అందరికి ఎసరు తప్పదు. లేదంటే రిజర్వ్ బెంచ్ లో ఒకరే ఉంటారు. ఇవన్నీ చూస్తుంటే ఇషాన్ కిషన్ పరిస్థితి కొంచెం డేంజర్ జోన్ లోనే ఉన్నట్టుంది. ఈ సమయంలోనే తను మళ్లీ నిరూపించుకోవాలి. అందుకు బంగారం లాంటి రంజీ ట్రోఫీలను వదిలేశాడు.ఇక ఆఖరి అవకాశం ఉంది. అది ఐపీఎల్ లో ఆడి మళ్లీ పూర్వ వైభవం వస్తే, ఆరిపోతున్న దీపం వెలిగే అవకాశం ఉందని సీనియర్లు అంటున్నారు.

తన కెరీర్ ఒడిదుడుకులతో సాగడం, రిజర్వ్ బెంచ్ కే పరిమితం కావడంతో ఇషాన్ కిషన్ బాగా టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. అయితే సీనియర్లు చెప్పే మాటేమిటంటే, ఎంత గొప్ప ఆటగాడికైనా ఇలాంటి పరిస్థితి వస్తుంది. వాళ్లు తిరిగి పుంజుకోవాలి. అందుకోసం మార్గాలను అన్వేషించాలి. రంజీ ట్రోఫీలు జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ ఆడి సెలక్టర్ల ద్రష్టిలో పడుతున్న, నీలాంటి వారు చాలామంది ఉన్నారని చెబుతున్నారు.

సంజూ శాంసన్ మళ్లీ అలా వచ్చినవాడేనని అంటున్నారు. పుజారా కూడా డబుల్ సెంచరీ చేశాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ తో సిరీస్ కు తప్పకుండా సెలక్ట్ అవుతాడని అంటున్నారు. రింకూసింగ్ కూడా ఇరగదీస్తున్నాడని, మరికొందరు వెలుగులోకి వస్తున్నారని చెబుతున్నారు. మరి ఇషాన్ ఏం చేస్తాడో వేచి చూడాల్సిందే.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×