BigTV English

Uttarpradesh: రాక్షసులు.. విద్యార్థి నోటిలో ప్రైవేట్ పార్ట్స్ పెట్టి.. మూత్రంపోసి.. దారుణం

Uttarpradesh: రాక్షసులు.. విద్యార్థి నోటిలో ప్రైవేట్ పార్ట్స్ పెట్టి.. మూత్రంపోసి.. దారుణం

Uttarpradesh: దేశంలో అత్యధికంగా నేరాలు జరిగే రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. ఒక విద్యార్థి పట్ల కాన్పూర్ లో గత సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎల్ఐయూ కానిస్టేబుల్ కొడుకు.. తన ఆరుగురు స్నేహితులతో కలిసి ఎంసీఏ స్టూడెంట్ ను, అతని స్నేహితుడిని కిడ్నాప్ చేసి దారుణానికి పాల్పడ్డారు. కారును నగరం చుట్టూ తిప్పుతూ.. ఇద్దరినీ తీవ్రంగా కొట్టారు. ఆపై సన్నీయాదవ్, అతని సహచరులు వారి ప్రైవేట్ భాగాన్ని బలవంతంగా నోటిలో కుక్కారని.. ఆపై ఒక్కొక్కరూ ముఖంపై మూత్ర విసర్జన చేసినట్లు బాధిత విద్యార్థి పోలీసులకు తెలిపాడు.


కాన్పూర్ పోలీస్ కమిషనర్ అఖిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కళ్యాణ్ పూర్ లోని బారాసిరోహిలో ఎల్ఐయూ కానిస్టేబుల్ కడుకు సన్నీయాదవ్ అలియాస్ హిమాన్షును.. రాధాపురం నివాసి అయిన ఎంసీఏ స్టూడెంట్ ఆయుష్ ద్వివేది.. అతని సహచరులు కొట్టారు. ఈ క్రమంలో పోలీసులు ఆయుష్ పై కేసు కూడా నమోదు చేశారు. ప్రతీకారం తీర్చుకునేందుకు సన్నీయాదవ్ హనీట్రాప్ ద్వారా ఆయుష్ ను ట్రాప్ చేశాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఫేక్ ఐడీని క్రియేట్ చేసి.. ఆయుష్ కు మెసేజ్ చేశాడు. తనను కలవాల్సిందిగా ఆయుష్ ను పరేడ్ దగ్గరకు పిలిచారు.

ఆయుష్ తన స్నేహితుడు బిట్టు అలియాస్ అభిషేక్ తో కలిసి పరేడ్ కు వెళ్లాడు. సన్నీ తన సహచరులైన శుభమ్ సోంకర్, నందుదూబే, రిషబ్ చౌహాన్, రజత్, మోహిత్, ఆయుష్ మిశ్రాలతో కలిసి ఇన్నోవా కారులో ఆయుష్ ద్వివేది, అభిషేక్ లను కిడ్నాప్ చేశారు. మధ్యాహ్నం 1 గంట వరకూ సాయంత్రం వరకూ కారులోనే తీవ్రంగా కొట్టి, నోటిలో ప్రైవేట్ పార్ట్స్ ను చొప్పించి, ముఖంపై మూత్ర విసర్జన చేశారని ఆయుష్ చెబుతున్నాడని ఎస్.పి అఖిల్ కుమార్ తెలిపారు. అంతేకాదు.. సన్నీ తన తండ్రి ధర్మేంద్రను కూడా పిలిపించి.. ఆయుష్ ను స్పృహ కోల్పేయేంత వరకూ కొట్టాడని ఆరోపించాడన్నారు. అనంతరం ఆయుష్ ను కళ్యాణ్ పూర్ కేసా కూడలి వద్ద, బిట్టును హోటల్ ల్యాండ్ మార్క్ వద్ద పడేసి పారిపోయినట్లు చెప్పారు.


ఆయుష్ ద్వివేది, అభిషేక్ ల పట్ల అమానవీయంగా వ్యవహరించిన సన్నీ, శుభమ్ సోంకర్, నందుదూబే, రిషబ్ చౌహాన్, రజత్, మోహిత్, ఆయుష్ మిశ్రాలపై తీవ్రమైన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇందులో కానిస్టేబుల్ ధర్మేంద్రపాత్ర ఉందన్న ఆరోపణపై విచారణ చేస్తున్నామని, ఇది రుజువైతే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Related News

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. వ్యాన్- కంటైనర్ ఢీ.. స్పాట్‌‌లో 10 మంది మృతి, ఇంకా

Delhi crime news: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్ పూల్ వెళ్లిన బాలికలపై అత్యాచారం!

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Kerala Crime: గదిలో లాక్ చేసి.. మతం మారాలంటూ ప్రియురాలిని వేధించిన ప్రియుడు.. ప్రాణాలు విడిచిన యువతి

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Big Stories

×