Rishabh Pant : ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. టీమిండియా నుంచి ఓపెనర్ యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ మంచి ఓపెనింగ్ చేశారు. తొలి వికెట్ కి 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కే.ఎల్.రాహుల్ 42 పరుగులు వ్యక్తి గత స్కోరు వద్ద తొలి వికెట్ గా వెనుదిరిగారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్ ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ బౌలింగ్ లో డకౌట్ గా వెనుదిరిగాడు. కేవలం నాలుగు బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు సాయి సుదర్శన్. స్టోక్స్ బౌలింగ్ ఆన్ సైడ్ లఅనవసర షాట్ కి యత్నించి వికెట్ కీపర్ జెమ్మీ స్మిత్ చేతికి చిక్కాడు. ఇలా తన ఆరంగేట్ర మ్యాచ్ లో డకౌట్ గా వెనుదిరిగాడు. వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయి భారత్ కాస్త చిక్కుల్లో పడినట్టు కనిపించింది. ఇక ఆ తరువాత క్రీజులోకి కెప్టెన్ శుబ్ మన్ గిల్ వచ్చాడు. యశస్వి జైస్వాల్, గిల్ దాదాపు 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
Also Read : Shubman Gill: బ్లాక్ సాక్స్ వివాదం… గిల్ పై ICC సీరియస్..బ్యాన్ విధిస్తుందా ?
ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ 101 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తరువాత బ్యాటింగ్ కి వచ్చిన వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ క్రీజులో పాతుకుపోయాడు. రెండో రోజు రిషబ్ పంత్ సెంచరీ చేశాడు. తొలి రోజు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్ ఇవాళ ఆట ప్రారంభం నుంచి దూకుడుగా ఆడుతున్నాడు. 10ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో ఆయన 105 పరుగులు పూర్తి చేశాడు. ముఖ్యంగా పంత్ సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేయడం విశేషం. సెంచరీ చేయగానే రిషబ్ పంత్ ఐపీఎల్ మ్యాచ్ లో గంతులు వేసినట్టు ఇంగ్లాండ్ లో కూడా గంతులు వేయడం విశేషం. ఈ నేపథ్యంలోనే క్రికెట్ దిగ్గజం.. కామెంటేటర్ సునీల్ గవాస్కర్ పంత్ పై పొగడ్తల వర్షం కురిపించారు. సెంచరీ పూర్తి కాగానే.. సూపర్బ్.. సూపర్బ్ అంటూ అభినందించారు. బీజీటీలో పంత్ విఫలమైనప్పుడు గవాస్కర్ స్టుపిడ్..స్టుపిడ్ అంటూ తిట్టిన విషయం తెలిసిందే. ఇక టీమిండియా తరపున వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్ తరపున అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన తొలి వికెట్ కీపర్ గా పంత్ రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో ఆయన ఈ ఘనత సాధించాడు. ఈ నేపథ్యంలోనే భారత క్రికెట్ దిగ్గజం ఎం.ఎస్. ధోనీ (6)ని పంత్ అధిగమించాడు.
శుబ్ మన్ గిల్ 147 పరుగుల వద్ద క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత జట్టు 106 ఓవర్లకు 450 పరుగులు పూర్తి చేసుకుంది. క్రీజులో రిషబ్ పంత్ 132, జడేజా 1 పరుగులు చేసి ఉన్నారు. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా టీమిండియా విజయం సాధిస్తుందా..? అని అన్న వారికి ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రాహుల్, శుబ్ మన్ గిల్, రిషబ్ పంత్ సమాధానం చెప్పారు. మాకెవ్వరూ సాటిలేరు అన్నట్టు కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీనియర్ల కంటే కూడా కాస్త మెరుగ్గా రాణించారు. మరోవైపు ప్రస్తుతం బ్యాటింగ్ కొనసాగిస్తున్నప్పటికీ ఇంగ్లాండ్ వాతావరణ శాఖ మాత్రం వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణం నివేదికలు చెబుతున్నాయి. తొలి రోజు అయితే టీమిండియా ఎలా ఆటలో డామినేట్ చేసిందో అందరికీ తెలిసిందే. కానీ రెండో రోజు వెంట వెంటనే వికెట్లు పడిపోయాయి. టీమిండియా బ్యాటర్లు ఎంత స్కోర్ చేస్తారో వేచి చూడాలి మరీ.
Rishabh Pant Century 🔥🚨💥
Coolest Flip Celebration 🥶🔥💥 pic.twitter.com/8wFYWizREt
— Abhinav MSDian™ (@Abhinav_hariom) June 21, 2025