Shubman Gill: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయిన టీమిండియా మొదట బ్యాటింగ్ కు దిగింది. మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా అదరగొడుతోంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తూ..గిల్ సేన దుమ్ము లేపుతోంది. సాయి సుదర్శన్ మినహా మిగతా ప్లేయర్ లందరూ అద్భుతంగా ఆడుతున్నారు. మొదటి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి 350 కి పైగా పరుగులు చేసి కేవలం మూడు వికెట్లు మాత్రమే టీమిండియా కోల్పోయింది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా యంగ్ కెప్టెన్ గిల్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు.
సరి కొత్త వివాదంలో గిల్ .. రంగంలోకి ఐసీసీ
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ నిన్న ప్రారంభం కాగా.. టీమిండియా యంగ్ కెప్టెన్ గిల్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఈ మొదటి మ్యాచ్ లో జరిగిన మొదటి రోజు ఆటలో… బ్యాటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు గిల్. మొదటిరోజు బ్యాటింగ్ చేసే నేపథ్యంలో బ్లాక్ సాక్సులు వేసుకొని రంగంలోకి దిగాడు. మ్యాచ్ మొత్తం ఆ బ్లాక్ సాక్సులతో మాత్రమే క్రికెట్ ఆడాడు శుభమన్ గిల్.
ఇప్పుడు ఇదే గిల్ కొంప ముంచేలా కనిపిస్తోంది. రెండవ టెస్ట్ ఆడకుండా అతనిపై ఐసీసీ యాక్షన్ తీసుకునే ప్రమాదం కూడా పొంచి ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై ఐసీసీకి కూడా ఇంగ్లాండ్ టీం ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. వాస్తవానికి టెస్ట్ మ్యాచ్ లో బ్లాక్ సాక్సులు అస్సలు ధరించకూడదని చెబుతున్నారు. అది మొదటి నుంచి ఆనవాయితీగా కొనసాగుతోంది. కానీ గిల్ మాత్రం బ్లాక్ కలర్ సాక్సులు వాడి అడ్డంగా బుక్ అయ్యాడు.
బ్లాక్ సాక్సులు ( Shubman Gill socks) ఎందుకు వాడకూడదు?
టెస్ట్ మ్యాచ్ లలో బ్లాక్ సాక్షులు వాడితే నేరమే. కచ్చితంగా వైట్ డ్రెస్ తో పాటు వైట్ సాక్సులు వాడాలి. ఐసీసీ రూల్స్ 19.45 క్లాజ్ ప్రకారం… టెస్ట్ మ్యాచ్ ఆడే ప్రతి ఒక్కరు… వైట్ జెర్సీ మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. సాక్సుల విషయానికి వస్తే కచ్చితంగా వైట్, క్రీమ్ లేదా లైట్ గ్రే ఇవి మాత్రమే వాడాలి. కాదని బ్లాక్ లాంటి ఇతర కలర్స్ వాడితే కచ్చితంగా ఆ ప్లేయర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది ఐసీసీ పాలకమండలి. ఇలాంటి నేపథ్యంలోనే గిల్ పైన కూడా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ లెక్క ప్రకారం మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేసిన గిల్ పై ఐసీసీ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిజంగానే యాక్షన్ తీసుకుంటే కచ్చితంగా రెండవ మ్యాచ్ ను గిల్ ఆడబోడని తెలుస్తోంది.
Also Read: Virat – Genelia :పెళ్లి పిల్లలు ఉన్నా తెలుగు హీరోయిన్ తో కోహ్లీ రొమాన్స్.. ఏకంగా లిఫ్టులోనే!
🚨 𝑹𝑬𝑷𝑶𝑹𝑻𝑺 🚨
Shubman Gill may face disciplinary action for breaching the ICC’s clothing regulations, after wearing black socks during his innings on Day 1.
According to clause 19.45 of the ICC’s Clothing and Equipment Rules, players are only permitted to wear socks that… pic.twitter.com/V2ZgUsOURq
— Sportskeeda (@Sportskeeda) June 21, 2025