Indian Railways: బెంగళూరు – మంగళూరు రైల్వే మార్గంలో దాదాపు ఐదు గంటల పాటు రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. యడకురి, షిరిబాగిలు స్లేషన్‌ల మధ్య ఈ రోజు తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ట్రాక్‌పై భారీ రాళ్లు పడడంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. ఆ ఘటన కర్నాటక రాష్ట్రంలోని సహ్యాద్రి పర్వత శ్రేణిలోని సక్లేష్ పూర్ సమీపంలో చోటుచేసుకుంది. దీంతో ఈ మార్గంలోని రైలు సర్వీసులన్నీ దాదాపు ఐదు గంటల సేపు నిలిచిపోయాయి. ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో సౌత్ వెస్ట్ రైల్వే అధికారులు వెంటనే రియాక్ట్ అయ్యారు. ట్రాక్‌ను మళ్లీ పునరుద్దించేందుకు వేగంగా చర్యలు చేపట్టారు. ఉదయం 9:10 గంటలకు ట్రాక్ సమస్యను అధికారులు క్లియర్ చేశారు.
ఈ సంఘటన వల్ల 16511 నంబర్ గల కేఎస్ఆర్ బెంగళూరు- కన్నూర్ ఎక్స్‌ప్రెస్ కడగరవల్లి స్టేషన్‌లో, ట్రైన్ నంబర్ 16585 ఎస్ఎంవీటీ బెంగళూరు, 07377 నంబర్ గల విజయపుర – మంగళూరు సెంట్రల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ సక్లేష్‌పూర్ స్టేషన్‌లో నిలిచిపోయాయి. ఈ స్టేషన్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు రైల్వే అధికారులు ఆహారం, నీరు అందజేశారు. ప్రయాణికులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. మైసూర్ రైల్వే డివిజనల్ మేనేజర్ తక్షణ చర్యలతో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ట్రాక్‌పై పడిన బండరాళ్లను తొలగించడానికి అధికారులు భారీ యంత్రాలను ఉపయోగించారు. అయితే ఈ ప్రాంతంలో కొండలు ఎక్కువగా ఉండడంతో.. పునరుద్ధరణ పనులు కాస్త కష్టతరంగా మారింది. ట్రాక్‌ను పూర్తిగా సురక్షితంగా టెస్ట్ చేసిన తర్వాతనే రైళ్ల రాకపోకలకు అధికారులు అనుమతించారు.
ALSO READ: Railway Coaches: ఆ రైలు బోగీలు ఇక కనిపించవు.. రైల్వే కీలక నిర్ణయం
ఈ రైల్వే మార్గం 413 కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది. ఈ మార్గంలో సహ్యాద్రి పర్వతాల గుండా అత్యద్భుతమైన సుందర దృశ్యాల మధ్య ఈ రైల్వే మార్గం ఉంటుంది. ఈ ఏరియాలో గతంలో చాలా సార్లు భూకంపనాలు, కొండచరియలు విరిగిపడడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. గతేడాది ఆగస్టులో సక్లేష్‌పూర్ సమీపంలో కొండచరియలు విరిగిపడడంతో రైళ్ల సర్వీసులు 12 రోజుల పాటు నిలిచిపోయాయి. ఈసారి, అధికారుల సమర్థవంతమైన చర్యలతో.. పకడ్బందీగా సమస్యను త్వరగా పరిష్కరించారు.
ALSO READ: Viral Video : అంతా డ్రామా.. విమానంలో 11A సీటు కోసం గొడవ.. ఆ వీడియో ఫేక్
ఈ సంఘటన గురించి నెటిజన్లు సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పలు పోస్టులు చేశారు. రైల్వే అధికారులు త్వరగా స్పందించి.. సమస్యను పరిష్కరించారని అన్నారు. ప్రయాణికుల భద్రతను కాపాడినందుకు రైల్వే సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటనతో ఈ రైల్వే మార్గంలో ఎదుర్కొంటున్న పలు సవాళ్లను మరోసారి గుర్తు చేసింది. మున్మందు ఇలాంటి ఘటనలను నివారించేందుకు ట్రాక్‌ల వెంట కొండచరియలను నియంత్రించాలని ప్రయాణికులు కోరుతున్నారు.