E-Paper
Advertisement

England vs Pakistan: పాక్ అభిమాని ఓవ‌రాక్ష‌న్‌..స్టేడియంలోనే చిత‌క‌బాదిన ఇంగ్లాండ్ ఫ్యాన్‌

England vs Pakistan: పాక్ అభిమాని ఓవ‌రాక్ష‌న్‌..స్టేడియంలోనే చిత‌క‌బాదిన ఇంగ్లాండ్ ఫ్యాన్‌
Advertisement

England vs Pakistan: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026 ) నేపథ్యంలో ప్రస్తుతం సూపర్ 8 దశ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్టేజి కూడా దాదాపు ముగిసింది. వచ్చే వారంలో సెమీ ఫైనల్ మ్యాచ్ లు కూడా ప్రారంభం అవుతాయి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ కు ఘోర అవమానం ఎదురయింది. ఓవరాక్షన్ చేసిన పాకిస్తాన్ అభిమానిని ఇంగ్లాండ్ కు చెందిన ఓ వ్యక్తి దారుణంగా చితకబాదాడు. ఇంగ్లాండ్ ఓడిపోతుందని, అనవసరంగా ఆ దేశ అభిమానులను గెలికాడు పాకిస్తాన్ అభిమాని సౌద్ ( pak fan saud). దీంతో రెచ్చిపోయిన ఇంగ్లాండ్ అభిమాని… పాకిస్తాన్ ఫ్యాన్ ను బండ బూతులు తిడుతూ దాడి చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన ఇండియన్ ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు. పాకిస్తాన్ వాడికి దూల తీరాల్సిందే.. ఇలా చితక బాదాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Ind T20i wc 2026-WC 2011: గంభీర్ అంధ భ‌క్తుల వెర్రి ప్ర‌చారం..2011 వ‌ర‌ల్డ్ క‌ప్ హిస్ట‌రీ, 2026లో రిపీట్ అవుతుందంటూ ఓవరాక్ష‌న్‌

Advertisement

 

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026 )  సూపర్ 8లో భాగంగా ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ ( England vs Pakistan ) మధ్య మంగళవారం రోజున మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. శ్రీలంకలోని పల్లెకేలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( Pallekele International Cricket Stadium, Pallekele) వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టును చిత్తు చేసిన ఇంగ్లాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. పాకిస్తాన్ పైన ఏకంగా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇంగ్లాండు. ఈ విజయంతో సెమీఫైనల్ బరిలోకి అడుగు పెట్టింది ఇంగ్లాండ్ టీం.

Advertisement

అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన అభిమాని సౌద్ కాస్త ఓవరాక్షన్ చేశాడు. ఇంగ్లాండ్ అభిమానుల వద్దకు వెళ్లి రెచ్చిపోయాడు. స్టేడియంలో లైవ్ మ్యాచ్ జరుగుతుండగానే ఈ సంఘటన జరిగింది. ఇక పాకిస్తాన్ అభిమాని ఓవర్ చేయడంతో ఇంగ్లాండు ఫ్యాన్ రెచ్చిపోయాడు. వెంటనే బండ బూతులు తిడుతూ అతనిపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. అప్పటికే నాలుగు దెబ్బలు కూడా కొట్టాడు ఇంగ్లాండ్ అభిమాని. ఇంతలోనే శ్రీలంకకు చెందిన అభిమానులు జోక్యం చేసుకొని, గొడవ సద్దుమణిగేలా చేశారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే సాధ్యమేనా ?

ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్తాన్… సెమీ ఫైనల్ ఆశలను దాదాపు చేజార్చుకున్నట్లేనని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్తాన్ సెమీ ఫైనల్ చేరాలంటే, న్యూజిలాండ్ తన తర్వాతి రెండు మ్యాచ్ ల‌లో ఓడిపోవాలి. ఇటు పాకిస్తాన్ శ్రీలంకపై గ్రాండ్ విక్టరీ కొట్టాలి. అదే సమయంలో నెట్ రన్ రేట్ కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. ఇలా జరిగితేనే పాకిస్తాన్ సెమీ ఫైనల్స్ చేరుతుంది.

 

Also Read:  Hardik Pandya-Mahieka Sharma: హార్దిక్ పాండ్యా ఇంట్లోనే శ‌త్రువులు, ఔట్ కాగానే చప్పట్లు కొట్టిన మహికా శర్మ

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×