Ind vs Eng, 4th T20I: టీమిండియా ( team india ) వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 5 t20 ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంటులో 3 t20 మ్యాచ్ లు పూర్తీ అయ్యాయి. అయితే ఇవాళ… నాల్గవ టి20 ఇంగ్లాండ్ అలాగే టీమిండియా మధ్య జరగనుంది. మహారాష్ట్రలోని పూణే… మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో… టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నాలుగవ టి20 జరుగుతోంది.
Also Read: Champions Trophy 2025: ఆ రోజునే దుబాయ్ కి టీమిండియా..రిచ్ హోటల్ లోనే బస !
అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. అయితే ఇందులో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ జట్టు… మొదట బౌలింగ్ తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఇవాల్టి మ్యాచ్లో మొదట టీమిండియా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటల సమయంలో ప్రారంభమవుతుంది.
అయితే ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచిన టీమిండియా… ఇవాల్టి మ్యాచ్ లో… గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది. అందుకే జట్టులో కీలక మార్పులు చేసింది టీమిండియా. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని పక్కకు పెట్టారు సూర్యకుమార్ యాదవ్. మహమ్మద్ షమీ స్థానంలో అర్షదీప్ సింగ్.. ను మళ్లీ బరిలోకి దింపనున్నారు. మూడవ టి20 మ్యాచ్ లో మహమ్మద్ షమీ పెద్దగా రాణించలేదు. అదే అర్షదీప్ ఉంటే… కీలక వికెట్లు తీసేవాడు.
అందుకే కీలకమైన నాలుగో టి20 మ్యాచ్ లో… సూర్య కుమార్ పెద్ద సాహసమే చేశాడు. డేంజర్ ఆటగాడు మహమ్మద్ షమీ ని పక్కకు పెట్టి అర్షదీప్ సింగ్ ను తీసుకు వచ్చాడు. అలాగే గాయం నుంచి కోలుకున్న రింకు సింగ్ ను జట్టులోకి తీసుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. దీంతో జురెల్ పైన వేటు పడింది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో శివమ్ దూబే వచ్చాడు. `
ఇక టాస్ సందర్బంగా సూర్యకుమార్ యాదవ్ ( surya kumar yadav ) మాట్లాడుతూ… పూణే వేదికగా మంచి బ్రాండ్ క్రికెట్ ఆడతామన్నారు. మూడో మ్యాచ్ ను రాజ్ కోట్ లోనే వదిలేశాం. షమీ స్థానంలో అర్ష్ దీప్, జురెల్ స్థానంలో రింకూ సింగ్ లను తీసుకున్నట్లు పేర్కొన్నాడు సూర్యకుమార్ యాదవ్. వాషింగ్టన్ సుందర్ స్థానంలో శివమ్ దూబే వచ్చాడు అని పేర్కొన్నాడు సూర్యకుమార్ యాదవ్.
Also Read: Moin Khan on Indian Players: టీమిండియా ప్లేయర్లతో దోస్తానా వద్దు.. బార్డర్ లో శత్రువుల్లా చూడండి ?
జట్లు:
భారత్: సంజూ శాంసన్( వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి
ఇంగ్లాండ్: ఫిలిప్ సాల్ట్( వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెతెల్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్