Moin Khan on Indian Players: వన్డే ఫార్మాట్ మెగా టోర్ని ఛాంపియన్స్ ట్రోఫీ – 2025 ఎడిషన్ ఆదిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే భద్రతా కారణాల దృశ్యా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును పాకిస్తాన్ కి పంపించడం లేదు. దీంతో భారత్ ఆడే మ్యాచ్ లు అన్ని తటస్థ వేదిక అయిన దుబాయ్ వేదికగానే జరగనున్నాయి. ఫిబ్రవరి 19 నుండి ఈ మెగా టోర్ని ప్రారంభం కాబోతోంది.
Also Read: Virat Kohli Wicket: రంజీ బౌలర్ చేతిలో కోహ్లీ క్లీన్ బౌల్డ్.. సాంగ్వాన్ సెలబ్రేషన్స్ అదరహో !
అయితే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే పాకిస్తాన్ మాజీ కెప్టెన్, మాజీ ఆటగాడు మోయిన్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెటర్లతో.. పాకిస్తాన్ ఆటగాళ్లు ఫ్రెండ్లీగా ఉండవద్దని ఆ దేశ ఆటగాళ్లకు సూచించాడు. ప్లేయర్ల పట్ల గౌరవం ఉంటే మంచిదేనని.. కానీ దాన్ని ఫీల్డ్ లో చూపించాల్సిన అవసరం లేదని అన్నాడు. మైదానంలో టీమిండియా ఆటగాళ్లతో కలివిడిగా ఉండాల్సిన అవసరం లేదని, అలా ఉంటే అది బలహీనతగా మారుతుందని పేర్కొన్నాడు.
” ఈ మధ్యకాలంలో మన వాళ్ళ వైఖరి నాకు అర్థం కావడం లేదు. భారత బ్యాటర్లు క్రీజ్ లోకి రాగానే వెళ్లి వారి బ్యాట్లను చెక్ చేయడం, ఫ్రెండ్లీగా మాట్లాడడం వంటివి చేస్తున్నారు. గౌరవం ఇవ్వడం వరకు ఓకే. కానీ ఈ అతి స్నేహం దేనికి..? భారత జట్టుతో మేము ఎన్నో మ్యాచులు ఆడాము. ద్వైపాక్షిక సిరీస్ లు కూడా ఆడాము. కానీ మైదానంలో ఎప్పుడు ఫ్రెండ్లీగా లేము. మా జనరేషన్ లో చాలా దిగ్గజాలు భారత జట్టులో ఉండేవారు. వారిని అప్పుడప్పుడు కేవలం ప్రత్యర్ధులుగానే ట్రీట్ చేసేవాళ్లం.
కానీ ఇప్పుడు జరుగుతున్న భారత్ – పాకిస్తాన్ మ్యాచ్లలో ఫ్రెండ్లీనెస్ ఓవర్ అయింది. ఇది అంతిమంగా జట్టు ప్రదర్శన పై ప్రభావం చూపించే అవకాశం ఉంది” అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడేందుకు భారత జట్టును పాకిస్తాన్ కి పంపించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయాలను గౌరవించాలని అన్నాడు.
వాస్తవానికి మోయిన్ ఖాన్ జనరేషన్ లో ఐసీసీ టోర్నీలో భారత్ ని ఎప్పుడు ఓడించింది లేదు. చివరిసారిగా 2017 లో ఇంగ్లాండ్ వేదికగా భారత్ – పాకిస్తాన్ లు తలపడ్డాయి. లీగ్ దశలో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. కానీ ఫైనల్ లో మాత్రం భారత్ పై పాకిస్తాన్ భారీ విజయం సాధించి కప్పును ఎగరేసుకుపోయింది. పాకిస్తాన్ సాధించిన చివరి ఐసీసీ టోర్నీ ఇదే కావడం విశేషం. ఇక ఫిబ్రవరి 23న దుబాయిలో భారత్ – పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలుపొంది గత ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత జట్టు గట్టి పట్టుదలతో ఉంది.
“Our seniors always told us that when playing against India give no quarter and no need to even talk to them on the field. When you get friendly, they see it as a sign of weakness,” Moin Khan said.#CT25 #INDvPAK #TeamIndia #Pakistan https://t.co/Muep8pG2MM
— Circle of Cricket (@circleofcricket) January 31, 2025