Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు ( Champions Trophy 2025 Tournament ) సమయం దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ సిరీస్ అనంతరం టీమిండియా చాంపియన్స్ ట్రోఫీలో ( Champions Trophy 2025 Tournament ) పాల్గొననుంది. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. ఈసారి ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. భద్రత కారణాల దృష్ట్యా టీమిండియా ( Team India ) ఆడేటువంటి మ్యాచులు అన్ని హైబ్రిడ్ మోడల్ ప్రకారం దుబాయ్ వేదికగా జరుగుతాయి. ఈ తరుణంలోనే… రోహిత్ శర్మ అండ్ కో…. దుబాయ్‌లో క్యాంప్ చేయనున్నారు. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ప్రారంభ మ్యాచ్‌కు ముందు వార్మప్ గేమ్ ఆడనుంది టీమిండియా. అంటే… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం… రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా ఫిబ్రవరి 15న దుబాయ్‌కి ( Dubai ) వెళ్లే అవకాశం ఉంది. అక్కడే రిచ్ హోటల్ ఉండనుంది.
Also Read: Virat Kohli Wicket: రంజీ బౌలర్ చేతిలో కోహ్లీ క్లీన్ బౌల్డ్.. సాంగ్వాన్ సెలబ్రేషన్స్ అదరహో !
మరోవైపు చాంపియన్స్ ట్రోఫీ టికెట్ ధరలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది. అయితే కరాచీ, లాహోర్, రావాల్పిండి వేదికగా జరిగే మ్యాచ్లకు సంబంధించిన టికెట్ ధరల వివరాలను మాత్రం ప్రకటించారు. దుబాయ్ వేదికగా జరిగే భారత మ్యాచ్ లకు సంబంధించిన టికెట్ ధరల వివరాలను ప్రస్తావించలేదు. మరి భారత్-పాకిస్తాన్ హై వోల్టేజ్ టికెట్లకు ఎంత ధరలను నిర్ణయిస్తారు అనేది చూడాలి. కాబట్టి టికెట్ ధరలను వివిఐపి, వీఐపీ, ప్రీమియం, ఫస్ట్ క్లాస్ మరియు జనరల్ ఇలా వేరువేరుగా నిర్ణయించారు. గ్యాలరీ టికెట్ ధర రూ. 25,000 కాగా…. వివిఐపి సీట్ల ధర రూ. 20,000 కు అమ్ముతున్నారు. వీఐపీ టికెట్ ధరలను రూ. 12,000గా నిర్ణయించారు. ఇది కాకుండా ప్రీమియర్, ఫస్ట్ క్లాస్ మరియు జనరల్ టికెట్ ధరలను రూ. 7000, 4000 మరియు 2 వేలకు నిర్ణయించారు.
అయితే ఇదంతా పాకిస్తాన్ కరెన్సీ ప్రకారం ప్రకారమే ఉంటుంది. ఇండియా కరెన్సీలో జనరల్ టికెట్ల ధరలను చూస్తే 370 రూపాయలు మాత్రమే. క్రికెట్ అభిమానులు ఛాంపియన్స్ ట్రోఫీకి టికెట్లను కొనుగోలు చేయాలని అనుకుంటే అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. ఇక చాంపియన్స్ ట్రోఫీ కోసం అన్ని రకాల జట్లు సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ – న్యూజిలాండ్ జట్ల మధ్య పోరు జరగనుంది. దీని తర్వాత ఫిబ్రవరిలో భారత్-బంగ్లాదేశ్ జట్లు తెలపడనున్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 23న భారత్-పాకిస్తాన్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరగనుంది.
Also Read: Moin Khan on Indian Players: టీమిండియా ప్లేయర్లతో దోస్తానా వద్దు.. బార్డర్ లో శత్రువుల్లా చూడండి ?
రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమిండియా తన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో న్యూజిలాండ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 2వ తేదీన జరగనుంది. టోర్నీలో ఫైనల్ మ్యాచ్ తో కలిపి మొత్తం 15 మ్యాచులు జరుగుతాయి. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. అంటే ఒక్కో గ్రూపులో నాలుగు టీమ్ లు ఉంటాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉంటాయి. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి.
Rohit Sharma and Co. will be camped in Dubai and are unlikely to play a warm-up game before their opening match against Bangladesh on February 20.#ChampionsTrophy2025 #IndianCricketTeam #RohitSharma #CricketTwitter pic.twitter.com/DEuuANZKdT
— InsideSport (@InsideSportIND) January 31, 2025