BigTV English

India Vs England 4th Test Live Updates: గెలుపు ముంగిట టీమిండియా.. విజయానికి మరో 152 పరుగులు..

India Vs England  4th Test Live Updates: గెలుపు ముంగిట టీమిండియా.. విజయానికి మరో 152 పరుగులు..
IND Vs Eng 4th Test Live Updates
Ravichandran Ashwin

IND Vs Eng 4th Test Live Updates(Cricket news today telugu): రాంచీలో టీమిండియా- ఇంగ్లాండ్ మధ్య జరుగతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 307 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఇంగ్లాండ్ కు 46 పరుగుల ఆధిక్యం లభించింది.


రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ భారత స్పిన్నర్ల ధాటికి 145 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అశ్విన్ ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది.  రోహిత్ శర్మ(24*), జైస్వాల్(16*) పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే మరో 152 పరుగులు చేయాలి.

తొలుత వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అద్భుతం పోరాటంతో టీమిండియా స్కోర్ 300 లు దాటింది. జురైల్ (90) చివరి వికెట్ గా అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.


ఒక దశలో టీమిండియా 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో ధ్రువ్ జురెల్, కులదీప్ 8వ వికెట్ కు 76 పరగులు జోడించి భారత్ ను ఆదుకున్నారు. కులదీప్ (28, 131 బంతుల్లో 2 ఫోర్లు) ఎంతో సహనంతో క్రీజులో నిలబడ్డాడు. జురెల్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.

కులదీప్ పెవిలియన్ కు చేరిన తర్వాత.. ఆకాష్ దీప్ (9, 29 బంతుల్లో ఒక సిక్సు) తో కలిసి 9 వికెట్ కు 40 పరుగులు జోడించాడు. ఆకాశ్ దీప్ అవుటైన కాసపటికే ధ్రువ్ జురెల్ కుడా పెవిలియన్ కు చేరాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 307 పరుగల వద్ద ముగిసింది. సెంచరీకి 10 పరుగుల దూరంలో జురెల్ అవుట్ అయ్యాడు.

Read More: జిమ్‌’బాబర్’ అంటూ ఫ్యాన్స్ హంగామా.. బాటిల్ విసరబోయిన పాక్ మాజీ కెప్టెన్.. వీడియో వైరల్..

ఇంగ్లాండ్ బౌలర్లలో స్పిన్నర్ సోయబ్ బషీర్ 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. మరో స్పిన్నర్ టామ్ హర్ట్ లీకి 3 వికెట్లు, వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ కు 2 వికెట్లు దక్కాయి.

ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ బెన్ డకెట్ (15)ను రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేశాడు. వెంటనే ఓలీ పోప్  (0)ను కూడా గోల్డెన్ డక్ చేశాడు. వరుస బంతుల్లో రెండు వికెట్లు పడ్డాయి. దీంతో ఇంగ్లాండ్ 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోర్ 65 పరుగుల వద్ద రూట్ జో (11) ను కూడా అశ్వినే పెవిలియన్ కు చేర్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జాక్ క్రాలీ(60) కుల్దీప్ యాదవ్ అద్భుతమైన డెలివరీతో బౌల్డ్ చేశాడు. కుల్దీప్ యాదవ్ స్టోక్స్‌(4)ను బౌల్డ్ చేశాడు. టీ బ్రేక్ తర్వాత తొలి బంతికే జడేజా బెయిర్‌స్టోను అవుట్ చేశాడు. ఆ తర్వాత కుల్దీప్ ఒకే ఓవర్లో హార్ట్లీ(7), రాబిన్‌సన్(0) వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ జట్టును కష్టాల్లోకి నెట్టాడు. ఒకే ఓవర్లో అశ్విన్ ఫోక్స్(17), అండర్సన్(0) వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేశాడు.

భారత బౌలర్లో అశ్విన్ 5, కుల్దీప్ 4, జడేజా 1 వికెట్ తీసుకున్నారు.

 

Tags

Related News

Under-16 : 160 బంతుల్లో 486 పరుగులతో రెచ్చిపోయిన అండర్-16 కుర్రాడు

Lalit Modi – Yuvraj : యువరాజ్ సింగ్ 6 సిక్స్ ల వెనుక లలిత్ మోడీ కుట్రలు.. ఇలా కూడా డబ్బు సంపాదించాడుగా!

Kohli-Rohith : కోహ్లీ, రోహిత్ శర్మను ఆడొద్దని అనే హక్కు ఎవడికీ లేదు.. ఇదే శాసనం

Asia Cup 2025 : ఆసియా కప్ కోసం రంగంలోకి మరో ఇద్దరు వికెట్ కీపర్లు.. ఇక దుబాయ్ లో దబిడ దిబిడే !

ASIA CUP 2025 : 5 రోజుల్లోనే ప్రారంభం కానున్న ఆసియా కప్.. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ పోస్టర్ రిలీజ్.. టోర్నమెంట్ షెడ్యూల్ ఇదే.. ఉచితంగా ఎలా చూడాలి

BCCI President : బీసీసీఐ ప్రెసిడెంట్ గా టీమిండియా మాజీ క్రికెటర్..?

Big Stories

×