BigTV English

Women Sitting on Heavy Rain on Road: ఒంటరి మహిళ.. జోరు వానలో బజ్జీలు వేస్తూ.. మదిని కదిలిస్తున్న వైరల్ వీడియో

Women Sitting on Heavy Rain on Road: ఒంటరి మహిళ.. జోరు వానలో బజ్జీలు వేస్తూ.. మదిని కదిలిస్తున్న వైరల్ వీడియో

viral news


Women Sitting in the Road in Heavy Rain: వానొస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. వానలో తడుస్తూ ఒళ్లంత తుళ్లింత కావాలిలే అంటూ ఓ పాటేసుకుంటారు. చల్లని చల్లని వాతావరణంలో వేడి వేడి మిర్చి బజ్జీనో, పకోడినూ తింటూ వర్షాన్ని ఆస్వాదిస్తాం. ఇంకా కళాపోషణ ఉన్న వారైతే.. కిటికీ పక్కనే కుర్చి వేసుకొని ఒక కప్పు వేడి వేడి టీ తాగుతూ వాన చినుకులను ఎంజాయ్ చేస్తారు. మరికొందరైతే బైక్‌పై అలా డ్రైవ్‌కి వెళ్తారు. చిన్న పిల్లలు అయితే కాగిత పడవులను వర్షపు నీటిలో వదులుతూ కేరింతలు కొడతారు.

కానీ వర్షం కురిస్తే అందరికీ ఒకేలా ఉండదు. అటువంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జోరు వర్షంలో ఓ మహిళ నెత్తిపై గొడుగు పెట్టుకుని వేడి వేడి బజ్జీలు వేస్తోంది. వాన కూడా భారీగా కురస్తుండటంతో రోడ్డుపై పెద్దగా జనాలు కూడా తిరగడం లేదు. గిరాకీ లేకపోవడంతో ఆ మహిళ అలానే దీనంగా చూస్తూ ఉండిపోయింది.


Read More: అయ్యో !ఎంత విషాదం.. చూస్తుంటే మనకే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయే..

ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది తెలియదు గానీ, ఇప్పుడు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వైరల్ అవుతుంది. వైరల్ వీడియోస్ అనే అకౌంట్ నుంచి వీడియో అప్లోడ్ అయ్యింది. వీడియోను చూసినట్లయితే ఒక పక్క జోరున వర్షం కురుస్తుంటే.. మహిళ చిరిగిపోయిన గొడుగుతో ఆ వర్షంలో కూర్చొని బజ్జీలు వేస్తోంది.

ఆమె కుర్చోడానికి సరైనవి కూడా లేవు. కింద చిన్న పట్టను వేసుకొంది. ఆమె చుట్టూ వర్షపు నీరు కూడా చేరింది. కొంత భాగం మహిళ వర్షంలో తడిసింది. వర్షంలో తడుస్తున్న బజ్జీలుపై మాత్రం వర్షపు నీరు పడకుండా గొడుకు పట్టింది. చుట్టు ప్రక్కన కొందరు జనాలు తిరుగున్నా ఆమెను పట్టించుకోవడం లేదు.

Read More: ఏం ధైర్యం సామీ.. పాముకు నోటితో ఊపిరి అందించాడు..!

ఇప్పటికే ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్‌‌తో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఈ వీడియోలో ఉన్న మహిళకు ఎదురుగా ఉన్న బోర్డును గమనించినట్లయితే తమిళ అక్షరాలు కన్పిస్తున్నాయి. అంటే ఈ ప్రాంతం తమిళనాడు రాష్ట్రంలోని ఓ పట్టణం అని తెలుస్తోంది.

కామన్‌గా బజ్జీల దుకాణం అంటే మనకు నాలుగు చక్రాల బండి గుర్తుకు వస్తుంది. కానీ ఈ మహిళ మాత్రం అలాంటిదేమీ లేకుండా మాములుగా చిన్న పట్టపై కూర్చుంది. చుట్టూ ఇనుపరేకు ఉంది. అంటే ఆమె ఎంత పేదరికంలో ఉందో? ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

 

Tags

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×