Sreesanth: శ్రియ శరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు సినీ పరిశ్రమలోనే ఈ చిన్నది తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఒకప్పుడు ఎంతో సాంప్రదాయంగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో మాత్రమే నటించే ఈ చిన్నది మెల్లిమెల్లిగా తన అందాలను ఆరబోస్తూ నటించింది. శ్రియకు విపరీతంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిన్నది ఎంతోమంది పెద్దపెద్ద హీరోల సినిమాలలోనూ హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు హిందీలోనూ అనేక సినిమాలలో హీరోయిన్ గా చేసింది.
ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో పెద్దగా నటించడం లేదు. వేరే భాషా సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇక ఈ చిన్నది సినిమాలలో నటిస్తున్న సమయంలో ఎంతోమంది పెద్దపెద్ద హీరోలతో ఏఫైర్లు పెట్టుకున్నట్టు ప్రేమాయణం కొనసాగించినట్టుగా అనేక రకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కేరళ స్పీడ్ స్టార్ శ్రీశాంత్ తో శ్రియా డేటింగ్ చేసినట్లు అనేక రకాల వార్తలు వచ్చాయి. అయితే శ్రీశాంత్ ఆ వార్తలన్నింటిని కొట్టి పారేస్తూ తన స్నేహితురాలు భువనేశ్వరి కుమారిని డిసెంబర్ 2013 సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఇక శ్రియ 2018లో తన ప్రియుడు ఆండ్రీ కోచ్చివ్ ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది.
ప్రస్తుతం శ్రీయ తన భర్త కూతురితో కలిసి ఎంతో సంతోషంగా తన లైఫ్ లీడ్ చేస్తోంది. వివాహం తర్వాత కూడా ఈ చిన్నది ఎప్పటిలానే సినిమాలలో నటిస్తూ తన కుటుంబంతో సంతోషంగా గడుపుతోంది. సమయం దొరికినప్పుడల్లా తన భర్త కూతురితో కలిసి వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి వైరల్ గా మారుతాయి. తనకూ తన కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక శ్రీయ అందాల ఆరబోతకు కుర్రాళ్ళు ఫిదా అవుతారు.
ఇది ఇలా ఉండగా.. టీమిడియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్… గతంలో జట్టుకు సేవలు అందించాడు. తన కెరీయర్లో మొత్తం 27 టెస్టులు ఆడిన శ్రీశాంత్… 87 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో వన్డే క్రికెట్ లో కూడా 53 మ్యాచ్లు ఆడాడు. ఈ నేపథ్యంలో 75 వికెట్లు పడగొట్టాడు శ్రీశాంత్. అలాగే t20 లు మొత్తం పది మ్యాచ్లు ఆడాడు. ఇందులో 7 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 2008 నుంచి 2013 వరకు… శ్రీశాంత్ ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో మొత్తం 40 వికెట్లు పడగొట్టాడు శ్రీశాంత్.