IPL – WWE : ఐపీఎల్ సీజన్ ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. వాస్తవానికి ఈ టోర్నీ వారం రోజుల పాటు వాయిదా పడటంతో అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. అయితే రేపటి నుంచి ఐపీఎల్ పున:ప్రారంభం కానుంది. రేపు జరుగబోయే మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. కేకేఆర్ కి ఇది కీలక మ్యాచ్ అనే చెప్పాలి. ఈ మ్యాచ్ లో కూడా ఓడిపోతే.. ఇక కేకేఆర్ ప్లే ఆప్స్ నుంచి తప్పుకున్నట్టే. రేపు బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ఉత్కంఠ పోరు జరుగనుంది. ఇక ఇది ఇలా ఉంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
Also Read : Budweiser-Virat : మందు బాబులకు గుడ్ న్యూస్.. కోహ్లీ పేరుతో కొత్త బీర్లు!
సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా క్రియేట్ చేసిన మీమ్స్ లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిందని.. విరాట్ కోహ్లీ కప్ ఎత్తుకుంటే.. రోహిత్ శర్మ వచ్చి లాగేసుకున్నట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. వాస్తవానికి ఈ వీడియోను WWEతో పోల్చారు. ఇందులో తాము విజయం సాధించినట్టు చేతి పైకి లేపగానే వెంటనే మరో ఆటగాడు వచ్చి విజయం సాధించిన ఆటగాడిని కొట్టి విజయం ఎలా సాధిస్తాడో ఈ మీమ్స్ లో కూడా అలాగే డబ్ల్యూ డబ్ల్యూ స్టార్ సెత్ రోలిన్స్ విరాట్ గెటప్ లో కప్ అందుకుంటే.. ఇక రోహిత్ శర్మ గెటప్ లో బ్రాక్ లెస్నర్ కాలయముడిలా వచ్చేసి విరాట్ కోహ్లీని పడేసి కప్ ఎగరేసుకుపోతాడు. ఈ సీజన్ లో తొలి క్వాలిఫైర్ లో రాయల్ ఛాలెంజర్స్ ఫైనల్ కి వెళ్తే.. ముంబై జట్టు ఎలిమినేటర్ లో విజయం సాధించి.. క్వాలిఫైర్ 2లో విజయం సాధించి.. చివరికీ ఫైనల్ కి వచ్చి టైటిల్ ఎగరేసుకుపోతుందని ముంబై ఇండియన్స్ అభిమానులు పేర్కొనడం విశేషం.
మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం ఈ సారి గ్యారెంటీ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ సాధిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్ రెండింటిలో కూడా బెంగళూరు జట్టు బలంగా కనిపిస్తోంది. దీంతో బెంగళూరు జట్టుకు తిరుగులేదనే టాక్ ఉంది. ఇప్పటికే ప్లే ఆప్స్ కి చేరుకుంది ఈ జట్టు. ఢిల్లీ, పంజాబ్ కింగ్స్ ముంబై జట్టును ఓడిస్తే.. ముంబై ప్లే ఆప్స్ కి కూడా చేరుకోవదని కొందరూ చెబుతున్నారు. ఈ సీజన్ లో గుజరాత్ మినహా బెంగళూరు జట్టుకు మరే జట్టు కూడా అంతగా పోటీ ఇవ్వలేకపోయింది. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలనే కసి కింగ్ విరాట్ కోహ్లీ లో ఉంది. సోషల్ మీడియాలో కూడా ఆ జట్టు టైటిల్ సాధించిందని.. రూమర్స్ సీజన్ ప్రారంభం నుంచే వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఫైనల్ గా ఈ సీజన్ లో ఏ జట్టు టైటిల్ సాధిస్తుందో వేచి చూడాలి మరీ.
?igsh=MXNwcnZ4d2Y5dnc0eA==