Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ప్రారంభానికి వారం రోజుల సమయం మాత్రమే ఉందన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి… ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో… టీమిండియాలో కల్లోలం చోటుచేసుకుంది. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కంటే ముందు… టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. భారత జట్టు డేంజర్ బౌలర్… జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah )… చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు దూరం కాబోతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 టోర్నమెంట్ నుంచి… టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా… గాయం కారణంగా బాధపడుతున్న సంగతి తెలిసిందే.
Also Read: Riyan Parag: అనన్య, సారా ప్రైవేట్ వీడియోలపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్ ?
అతని వెన్నునొప్పి… అంటే బ్యాక్ ఇంజురీ కారణంగా… అప్పటి నుంచి టీమిండియా కు దూరంగానే ఉంటున్నాడు బుమ్రా. మొదట ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ కు అతని సెలెక్ట్ చేసి… చివరి క్షణంలో తప్పించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అంతేకాదు చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు కూడా…జస్‌ప్రీత్ బుమ్రా ను ( Jasprit Bumrah ) సెలెక్ట్ చేసింది బీసీసీఐ. ఇప్పుడు మళ్లీ… ఈ విషయంలో వెనక్కి తగ్గింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయం తగ్గలేదట. అతని వెన్నునొప్పి మరింత పెరిగినట్లు సమాచారం అందుతుంది. అందుకే వైద్య పరీక్షలు చేసిన… వైద్యులు హెల్త్ రిపోర్ట్ తాజాగా విడుదల చేసినట్లు తెలుస్తోంది.
ఈ రిపోర్టు ప్రకారం… మరో నెల రోజుల పాటు జస్‌ప్రీత్ బుమ్రా రెస్ట్ తీసుకోవాలని సమాచారం. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నుంచి.. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా దూరం కాబోతున్నట్లు.. నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారిక ప్రకటన కూడా చేసింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా దూరం కానున్న తరుణంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం హర్షిత్ రాణా ను ( Harshit Rana ) తీసుకుంది బీసీసీఐ. దీనిపై అధికారిక ప్రకటన కూడా చేసింది BCCI.
వాస్తవానికి మహమ్మద్ సిరాజ్ ను జట్టులోకి తీసుకోవాల్సి ఉండేది. కానీ గౌతమ్ గంభీర్ కారణంగా హర్షిత్ రాణా ను ( Harshit Rana ) … చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు… తీసుకున్నారని సమాచారం అందుతోంది. ఇది ఇలా ఉండగా చాంపియన్స్ ట్రోఫీ 25 టోర్నమెంట్ ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు జరగనుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి… పాకిస్తాన్ జట్టు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే… టీమిండియా కోసం ఈ టోర్నమెంటును… హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తోంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. దీంతో టీమ్ ఇండియా ఆడే మ్యాచ్ లన్ని… దుబాయ్ వేదికగా జరగబోతున్నాయి. మిగతా మ్యాచ్లు పాకిస్తాన్ దేశంలో జరుగుతాయి.
Also Read: Rohit Sharma Mobile: కోట్లు సంపాదిస్తున్న చీప్ ఫోన్ వాడుతున్న రోహిత్.. ధర ఎంతంటే ?
🚨 NEWS 🚨
Fast bowler Jasprit Bumrah has been ruled out of the 2025 ICC Champions Trophy due to a lower back injury. Harshit Rana named replacement.
Other squad updates 🔽 #TeamIndia | #ChampionsTrophy https://t.co/RML5I79gKL
— BCCI (@BCCI) February 11, 2025