EPAPER

Rohit Sharma: రోహిత్ శర్మ అంటే.. ఏమనుకున్నారు?: ఫీల్డింగ్ కోచ్ దిలీప్

Rohit Sharma: రోహిత్ శర్మ అంటే.. ఏమనుకున్నారు?: ఫీల్డింగ్ కోచ్ దిలీప్

Rohit Sharma: ఏమిటో ఈ మధ్య అందరూ రోహిత్ శర్మను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు పాడ్ కాస్ట్ తో మాట్లాడుతూ తనంత గొప్ప వ్యక్తిని చూడలేదని చెబుతున్నారు. మొన్ననే అంపైర్ అనిల్ చౌదరి మాటలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా వీరి జాబితాలో భారత ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ చేరాడు.


ఇంతకీ తనేమన్నాడంటే.. రోహిత్ శర్మ ఫ్రెండ్లీ కెప్టెన్ అని కొనియాడాడు. అందరితో స్నేహభావంతో ఉంటాడు. జట్టులోని సభ్యులతోనే కాదు, కోచ్, సహాయక్ కోచ్ లు అందరితో కలివిడిగా ఉంటాడు. ఎవరిని నువ్వు తక్కువ, నేను ఎక్కువని తారతమ్యాలు చూపించడు.

మనిషిలో అహం అనేది లేదని అన్నాడు. అందుకే అతన్ని అందరూ అభిమానిస్తారని తెలిపాడు. రోహిత్ లాంటి వ్యక్తిత్వం ఉన్న మనుషులు చాలా అరుదుగా ఉంటారని తెలిపాడు.


నేను రోహిత్ తో పనిచేస్తున్నప్పుడు అతనిలోని మరో కోణం చూశానని అన్నాడు. డక్కన్ ఛార్జర్స్ లో ఇద్దరం కలిసి పనిచేశాం కానీ, అప్పుడు హలో అంటే హలో అన్నట్టే ఉండేది. కానీ టీమ్ ఇండియాలో కలిసి మూడేళ్లు పనిచేశాం. అప్పుడు చాలా దగ్గర నుంచి చూశానని తెలిపాడు. ప్రతి ఒక్కరితో అనుబంధం కలిగి ఉంటాడు.

Also Read: వాళ్లు తప్ప.. అందరూ వస్తున్నారు: అనంతపురంలో క్రికెట్ శోభ

ఎప్పుడూ సరదాగా ఉంటాడు. ఎవరు జోక్స్ వేసినా ఎంజాయ్ చేస్తుంటాడు. ఒక భోళా మనిషి. అయితే గ్రౌండ్ లోకి వెళ్లిన తర్వాత గేమ్ ని ఎంజాయ్ చేస్తాడు. కెప్టెన్ గా ఆటలో మంచి వాతావరణం సృష్టిస్తాడు.

ముఖం మాడ్చుకుని ఉండటం, మూడీగా మారిపోవడం ఉండదు. క్యాచ్ డ్రాప్ చేస్తే, అందరిలాగే తను అసహనం వ్యక్తం చేస్తాడు తప్ప, ఆ క్షణం దాన్ని అక్కడితో వదిలేస్తాడని తెలిపాడు.

టీ 20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో ఒక ఓవర్ లో అక్షర్ పటేల్ వేసిన ఓవర్.. ఆట స్వరూపాన్నే మార్చేసింది. నిజానికి అక్కడ నుంచి మళ్లీ కోలుకుంటామని ఎవరూ అనుకోలేదు. కానీ రోహిత్ మాత్రం మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేశాడు. అక్షర్ భుజం తట్టి, నువ్వు బౌలింగ్ బాగానే వేశావని ప్రశంసించాడు.

ఆఖరి బాల్ వరకు ఆటగాళ్లలో అలా ఉత్తేజాన్ని నింపుతూనే ఉంటాడు. ఎప్పుడూ ఓటమిని వన్ సైడ్ గా అంగీకరించడని తెలిపాడు. అదే అతని విజయ రహస్యమని తెలిపాడు.

అతనిలో లీడర్ షిప్ క్వాలిటీస్ చాలామంది చూసి నేర్చుకోవాలని అన్నాడు. అన్నింటికి మించి రోహిత్ చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చాడు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

Related News

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

Big Stories

×