BigTV English

Hema Committee Report: రాజకీయాల్లోకి వెళ్లిన ఈ నటుడు ఇంత దుర్మార్గుడా? మహిళలపై అసభ్యకర కామెంట్లు, వెకిలి చేష్టలు

Hema Committee Report: రాజకీయాల్లోకి వెళ్లిన ఈ నటుడు ఇంత దుర్మార్గుడా? మహిళలపై అసభ్యకర కామెంట్లు, వెకిలి చేష్టలు
Advertisement

Actor and MLA: మహిళలపై చాలా తేలికగా జోకులు పేల్చి నవ్వించేసి జస్టిఫికేషన్ పొందుతుంటారు. భార్య, సోదరి, ఫీమేల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్.. ఇలా ఎవరైనా సరే మహిళలను తక్కువ చేసి చవకబారు కామెంట్లు చేస్తుంటారు. సరదాగా కనిపించే ఆ జోకుల్లో మహిళల ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టడం ఇట్టే కనిపెట్టవచ్చు. ఈ పిచ్చి జోకులకు అభ్యంతర పెట్టకుండా చాలా మంది విని నవ్వేస్తుంటారు. ఇటీవలి కాలంలో ఇలాంటివాటిపై కొంత అవగాహన వస్తున్నది. కానీ, ప్రముఖుల నుంచి కూడా ఇలాంటి అబ్యూసివ్ జోక్స్ విన్నప్పుడు ఆ అవగాహన మళ్లీ మరుగునపడిపోతుంది. అలాంటి ప్రముఖుడే కేరళ యాక్టర్, ఎమ్మెల్యే ముకేష్.


కేరళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై ప్రభుత్వం వేసిన హేమా కమిటీ రిపోర్టు సంచలన వివరాలను వెల్లడించింది. అనేక రూపాల్లో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయని కుండబద్ధలు కొట్టింది. ఈ రిపోర్టు వెలువడ్డాక ఓ జూనియర్ ఆర్టిస్టు.. ప్రముఖ నటుడు ముకేష్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలతో ముకేష్ గతంలో చేని అనేక అసభ్యకర కామెంట్లు, వెకిలి చేష్టలు చర్చకు వచ్చాయి. మహిళలపై అభ్యంతరక వ్యాఖ్యలు చేస్తూ.. ఇవన్నీ సరదాగానేనని, కేవలం నవ్వుకోవడానికేనని సరిపుచ్చుకునేవాడు.

ఓ సారి ఆయన బహిరంగంగా ఓ స్టేజీ మీద సీనియర్ నటి జయభారతిపై అసభ్య వ్యాఖ్యలు చేశాడు. తాను, మరికొందరితో కలిసి కార్డ్ గేమ్ ఆడానని, ఆ గేమ్ పేరు ‘భారతి చెచి’ అని పెట్టుకున్నామని తెలిపాడు. అప్పుడు జయభారతి ఐదు రూపాయల కాయిన్ గెలుచుకుని తన బ్లౌజ్‌లో దాచుకుందని వివరించాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ ఆ కాయిన్ కావాలని వెంటపడేవారని పేర్కొన్నాడు. అప్పుడు నాటకీయంగా ఆ కాయిన్ అప్పటి వరకు ఎక్కడుందో అని కామెంట్ చేశాడు. ఆ తర్వాత మరింత జుగుప్సగా తాను ఆ కాయిన్ గెలుచుకున్నానని, ఆ కాయిన్ ఇవ్వాలని తనకు ఇతరులు లంచాలు ఆఫర్ చేశారన్నాడు.


Also Read: Khammam: బీఆర్ఎస్ నేతల ఖమ్మం పర్యటనలో ఉద్రిక్తత.. వాహనాలపై రాళ్లదాడి

ఇప్పుడు వైరల్ అవుతున్న ఓ వీడియో క్లిప్‌లో కూడా ముకేష్ అభ్యంతరకర ప్రవర్తన కనిపిస్తుంది. ఓ టీవీ షోకు వెళ్లిన ముకేష్ స్టేజీపైనే పొడవాటి రెడ్ డ్రెస్ వేసుకున్న మహిళ పై కామెంట్ చేశాడు. పాతరోజుల్లో థియేటర్‌లలో ఉండే ఎర్రటి కర్టెన్‌లను జ్ఞప్తికి తెచ్చిందని, ఆ తర్వాత ఆ కర్టెన్‌లు పైనకి లేచేటప్పుడు వచ్చే మ్యూజిక్‌ను అప్పుడు హమ్ చేశాడు. ఇప్పుడు ఆ మ్యూజిక్ ప్లే చేస్తే ఏం జరుగుతుందోననే ఆలోచన వచ్చిందని నవ్వేశాడు. ఇలాంటి జోకులు వేసినప్పుడు చుట్టుపక్కల ఉన్నవారు కూడా నవ్వేసేవారు. కానీ, ఆ రెడ్ డ్రెస్‌లో ఉన్న మహిళ పరిస్థితి ఏమిటీ? అనేదే ప్రశ్న.

నటుడు ముకేష్ కథకల్ అనే పేరుతో ఉండే పుస్తకాలు కూడా రాశాడు. అందులో ఇలాంటి అనేక ఘటనలను వాటిలో ప్రస్తావించాడు. ఆయన, ఆయన జోకులకు నవ్వేవారిని తప్పుపట్టలేం. కానీ, ఇక్కడ అభ్యంతరకరమైన విషయం ఏమిటీ? అనేది అవగాహనలోకి రావడానికి వారికి కొంత సమయం పట్టవచ్చు. ఓ బెంగాలీ నటితో యాక్టింగ్ చాన్స్ వచ్చిందని మిత్రుడిని ఇంప్రెస్ చేయడానికి తాను ఓ స్టోరీ తయారు చేసుకున్నానని తన పుస్తకం ముకేష్ కథకల్ వీందుమ్‌లో పేర్కొన్నాడు. ఆ నటి తనకు కేవలం నిక్కర్లు ధరించిన ఫొటోలు పంపుతుందని చెప్పుకున్నట్టు రాసుకున్నాడు.

మరో చాప్టర్‌లో ఓ డైరెక్టర్ తనకు ఇలా చెప్పాడని పేర్కొన్నాడు. తన నెక్స్ట్ రూంలో నటి శ్రీదేవి (ఫేమస్ యాక్టర్) ఉంటే తను హ్యాపీగా ఆమెతో పడుకునేవాడని, కానీ, ఆమె ఇప్పుడు లేదని చెప్పినట్టు రాశాడు. అదే ఒక వేళ తన నెక్స్ట్ రూంలో జూనియర్ ఆర్టిస్ట్ ఉంటే తనకు నిద్రలేని రాత్రులు మిగిలేవని జోక్ చేసినట్టు పేర్కొన్నాడు.

Also Read: Balakrishna: వరద బాధితుల కోసం రూ.కోటి విరాళమిచ్చిన బాలయ్య!

మరో పుస్తకంలో తన కాలేజీ డేస్‌లో జరిగిన ఘటనను ఇదే కోణంలో చెప్పే ప్రయత్నం చేశాడు. హాస్టల్‌లో ఇద్దరు యువతులు పోట్లాడుకున్నారని, ఇద్దరూ ఒకరినొకరి సెన్సిటివ్ పార్టులను కొరికి గొడవను ముగించారని వివరించాడు. ఆ గొడవపై తన కామెంట్‌గా.. వారి లవర్స్ ఆ కొరికిన పార్టులు కావాలని అడిగితే ఎలా అంటూ మరింత జుగుప్సగా పేర్కొన్నాడు.

ముకేష్ పై ఆయన మాజీ భార్య సరిత గృహ హింస ఆరోపణలు చేస్తున్న వీడియో కూడా వైరల్ అవుతున్నది. కానీ, ఆయన జోకులను ప్రస్తుతం ఈ వీడియో డామినేట్ చేయలేకున్నది. ముకేష్ వాక్చాతుర్యాన్ని చాలా మంది మెచ్చుకుంటారు. ఆయనకు మైక్ అందితే ఎన్నో కథలు అల్లుకుంటూ పోతాడు. అదే మహిళల గురించి అయితే.. ఆయన జోకులకు ఇక స్పీడ్ బ్రేకులే ఉండవు. ఎంతటి అభ్యంతరకరమైన మాటలైనా సులువుగా అనేస్తుంటాడు. హేమా కమిటీ రిపోర్టు తర్వాత.. తీసుకునే చర్యల వల్లనైనా ముకేష్ తన పద్ధతి మార్చుకుంటాడని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇంకా ఆయన ఎందుకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదని డిమాండ్ చేసేవాళ్లూ ఉన్నారు.

Related News

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Big Stories

×