BigTV English

Fifa World Cup Qatar Conditions : ఫిఫా వరల్డ్ కప్ సంబరాలకు ఖతార్ కండీషన్స్..

Fifa World Cup Qatar Conditions : ఫిఫా వరల్డ్ కప్ సంబరాలకు ఖతార్ కండీషన్స్..

Fifa World Cup Qatar Conditions : ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన క్రీడల్లో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. నాలుగేళ్లకోసారి జరిగే ఫిఫా వార్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడుతుంటారు. మ్యాచ్‌లు జరిగే ప్రాంతంలో ఫ్యాన్స్ పార్టీలు,డ్రగ్స్, మద్యం సేవిస్తుంటారు. పశ్చిమదేశాల్లో ఇది సర్వసాధారణమే అయినా… ఖతార్‌లో మాత్రం ఇలాంటి కార్యకలాపాలకు ఆస్కారం లేదు.


గల్ఫ్ దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. షరియా చట్టం ప్రకారం ఇక్కడ శిక్షల అమలు జరుగుతుంది. తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూసేందుకు ఇప్పటికే చాలా మంది ఖతార్ చేరుకున్నారు. దీంతో ఫిఫా అభిమానులను అదుపు చేసేందుకు ఖతార్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మ్యాచ్‌లు జరిగే స్డేడియాలు, ఫ్యాన్ జోన్‌లలో సాయంత్రం వేళలో మాత్రమే మద్యం సేవించేందుకు అనుమతిచ్చింది. ఫుల్లుగా తాగి రోడ్లపై పిచ్చివేశాలు వేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది.

డ్రగ్స్ ఊసెత్తితేనే ఖతార్ పోలీసులు ఊగిపోతారు. మారు మాట లేకుండా తీసుకెళ్లి జైలులో వేస్తారు. మద్యం విషయంలో కాస్త చూసీ చూడనట్టు ఉన్నా… డ్రగ్స్ విషయంలో మాత్రం ఉపేక్షించేది లేదంటున్నారు. ప్రేక్షకులకు అవగాహన కల్పించేందుకు ఖతార్ విమానాశ్రయంలోనే డ్రగ్స్‌పై బోర్డులు, హోర్డింగులు ఏర్పాటు చేశారు.


యూరోపియన్ దేశాల మాదిరిగా రోడ్లమీదే ముద్దులు, పొదలచాటున అసాంఘిక కార్యకలాపాలు చేయడం ఖతార్‌లో నిషేధం. వ్యభిచారంపై ఖతార్‌తో చాలా కఠిన ఆంక్షలున్నాయి. ఖతార్ చట్టాల ప్రకారం పెళ్లికాని పురుషుడు, స్త్రీ సెక్స్ చేయడం నేరంగా పరిగణిస్తారు.

సాధారణ సమయాల్లో అయితే పెళ్లి కాని అమ్మాయి, అబ్బాయి ఒకరి చేతిని ఒకరు పట్టుకుని నడిచినా ఖతర్‌లో తీవ్ర పరిణామాలుంటాయి. కానీ ఫిఫా ప్రపంచకప్ సందర్భంగా అక్కడి ప్రభుత్వం నిబంధనలను కొంత మేర సడలించింది. హోటల్‌లలో పెళ్లికాని యువతీ, యువకులు ఒకే గదిలో నివాసం ఉండవచ్చని తెలిపింది. కాని బహిరంగ ప్రదేశాల్లో మాత్రం హద్దుదాటొద్దని సూచించింది. ఇక గే, లెస్బియన్‌లకు ఎలాంటి మినహాయింపులు ఉండని ఖతార్ ప్రభుత్వం పేర్కొంది.

వేషధారణపై సైతం ఖతార్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఒళ్లు కనిపించేలా బట్టలు వేస్తే శిక్షలు తప్పవని హెచ్చరించింది. పోలీసులకు మిడిల్ ఫింగర్ చూపించడం, రాజకుటుంబీకులను తిట్టడం, అనుమతి లేని ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకుంటే ఖతార్ చట్టాల ప్రకారం జైలు శిక్ష అనుభవించకతప్పదు.

ఖతార్ చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తే ఏ ప్రమాదం ఉండదు. కాని నిబంధలను అతిక్రమిస్తే చిక్కుల్లోపడతారు. ఇలా ఖతార్ కఠిన చట్టాలతో ఫిఫా అభిమానుల రెక్కలు కత్తిరించినట్లైంది.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×