BigTV English

Ravichandran Ashwin: అశ్విన్.. లేటు వయసులో ఇదేం లొల్లి !

Ravichandran Ashwin: అశ్విన్.. లేటు వయసులో ఇదేం లొల్లి !
Ravichandran Ashwin latest news

IND vs ENG 2nd Test Highlights: టీమ్ ఇండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టాక్ ఆఫ్ ది మ్యాచ్ గా మారిపోయాడు. రెండో టెస్ట్ లో అశ్విన్ చాలా అగ్రెసివ్ గా కనిపించాడు. మ్యాచ్ మొదలైన మొదటి రోజు నుంచే అంపైర్లు,  ప్రత్యర్థి టీమ్ తో గొడవలు పడ్డాడు. తొలిటెస్టు తొలి ఇన్నింగ్స్ లో అయితే ఏకంగా రవీంద్ర జడేజాను తిట్టిపోశాడు. బ్యాటింగ్ చేస్తుండగా రన్ అవుట్ కావడంతో కేకలు వేశాడు. అక్కడితో ఆ ఎపిసోడ్ అయిపోయింది.


రెండో టెస్టులో అయితే ఏదొక ఇష్యూ అశ్విన్ వైపు నుంచి జరుగుతూనే ఉంది. బహుశా తొలి ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్టు కూడా పడకపోవడంతో చికాకుగా ఉన్నాడేమో అనుకున్నారు. ఇంతకీ అశ్విన్ చేసిన అల్లరి ఏమిటంటే…

తొలి రోజు ఆటను త్వరగా ముగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంపైర్ ఎరాస్మస్‌తో గొడవపడ్డాడు. ఒక నాలుగు ఓవర్లు ముందు మ్యాచ్ ను ముగించారు. ఇదీ సంగతి…


ఇక రెండో రోజు ఆటలో జేమ్స్ అండర్సన్ బౌలింగ్ చేసే సమయంలో అతన్ని కావాలనే అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ కూడా విమర్శలు వచ్చాయి.

మూడో రోజు ఆటలో అశ్విన్ కుదురుగానే కనిపించాడు. నాలుగో రోజు ఏకంగా బెయిర్ స్టోతో వాగ్వాదానికి దిగాడు.

బుమ్రా వేసిన ఓవర్ లో బెయిర్ స్టో(26) ఎల్బీ అయ్యాడు. అంపైర్ అవుట్ ఇవ్వడంతో భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో అశ్విన్ అత్యుత్సాహంతో ఒక అడుగు ముందుకేశాడు. విచారంతో వెళ్లిపోతున్న బెయిర్ స్టో ముందుకెళ్లి, జాతరలో స్టెప్పులేసినట్టు వేశాడు. అప్పటికే వళ్లు మండి ఉన్న బెయిర్ స్టో నోటికి పనిచెప్పాడు. తను కూడా సీరియస్ అయ్యాడు. ఇద్దరూ నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నారు.

అశ్విన్ చర్యలపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విరాట్ కొహ్లీకి ఎదురొచ్చినట్టున్నాడని కొందరు అంటున్నారు. అలా లేకపోతే తొక్కేస్తారని కొందరు కామెంట్లు పెడుతున్నారు. క్రికెట్ అంటే జంటిల్మన్ గేమ్, మనం భారతీయులం అయి ఉండి, అలాంటి వెర్రిచేష్టలు చేయకూడదని కొందరంటున్నారు.

క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అవుతున్న సమయంలో ఇవేం పనులు అశ్విన్ భయ్, కూల్ గా ఉండు, లేటు వయసులో ఈ లొల్లి అవసరమా? అని కొందరు సలహాలు ఇస్తున్నారు. ఏదేమైనా అశ్విన్ చర్యలపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related News

Kohli Beard : కోహ్లీకి తెల్ల గడ్డం… దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న అనుష్క శర్మ !

Salman Khan IPL Team RCB : జట్టును కొనబోతున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్?

Dewald Brevis : డెవాల్డ్ బ్రెవిస్ ఊచకోత.. ఏకంగా 8 సిక్స్ లతో రచ్చ..CSK ఇక తిరుగులేదు

Subhman-Anjini : టీమిండియా క్రికెటర్ తో అందాల తార ఎఫైర్… పబ్బులో అడ్డంగా దొరికిపోయారుగా

India Asia Cup Squad: ఆసియా కప్ కోసం 4 గురు ఆల్ రౌండర్లు, 6 గురు బౌలర్లు.. టీమ్ ఇండియా ఫుల్ స్క్వాడ్ ఇదే !

Dhoni – Abhishek : ఖాతాదారులకు భారీ మోసం.. ధోనికి 6 కోట్లు ఇస్తున్న SBI?

Big Stories

×