BigTV English

U19 World Cup Final : 36 ఏళ్లలో తొలిసారి.. ఓపెనర్ల చెత్త రికార్డ్..!

U19 World Cup Final : 36 ఏళ్లలో తొలిసారి.. ఓపెనర్ల చెత్త రికార్డ్..!
U19 World Cup Final

U19 World Cup Final 2024 Team India(Cricket news today telugu): అండర్ 19 వరల్డ్ కప్ 2024లో టీమ్ ఇండియా వైఫల్యానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. కొందరు పోస్ట్ మార్టమ్ మొదలెట్టేశారు. ఈ నేపథ్యంలో తేలిన ఒక భయంకరమైన నిజం ఏమిటంటే, యువ ఓపెనర్లు ఇద్దరూ దారుణంగా ఫెయిల్ అయ్యారని నిగ్గు తేల్చారు. 36 ఏళ్ల అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలో ఇంతటి ఘోరమైన ప్రదర్శన చేయలేదని తేల్చి చెప్పారు.


అంటే ఓపెనర్లు ఇద్దరూ కలిసి ఏ మ్యాచ్ లో కూడా కనీసం 50 పరుగుల పార్టనర్ షిప్ నమోదు చేయలేదు. దీని ఎఫెక్టు తర్వాత బ్యాటర్లపై పడింది. అయితే దానిని మిడిలార్డర్ సమర్థవంతంగా ఎదుర్కొంది. కాకపోతే ప్రతి మ్యాచ్ లో వారిద్దరిలో ఎవరో ఒకరు, త్వరగా అవుట్ అయిపోతుంటే వన్ డౌన్ లో వచ్చే ముషీర్ ఖాన్ పై ఒత్తిడి పడేది. తర్వాత కెప్టెన్ ఉదయ్ సహరన్ చూసుకునేవాడు. తర్వాత సచిన్ దాస్ టేకప్ చేసేవాడు.

అలా వాళ్లు వదిలేసిన అన్నిమ్యాచ్ ల్లో కూడా ఈ ముగ్గురే ఆడి నిలబెట్టారు. గెలిపించారు. అయితే ఫైనల్ లో ఆ ట్రిక్ పనిచేయలేదు. ఎప్పటిలా ఓపెనర్లు పాత పద్ధతిలో ఆడేసరికి, తర్వాత వచ్చేవాళ్లు మోయలేక కాడి వదిలేశారు.


Read more : ఆస్ట్రేలియాపై గెలవలేమా? నెట్టింట మీమ్స్ జాతర..

ఓపెనర్లు ఇద్దరూ ఇలా అవుట్ అయిపోతుంటే, మరొకరిని తీసుకురావల్సింది పోయి చూస్తూ ఉండిపోయింది. 2023 వన్డే వరల్డ్ కప్ లో విన్నింగ్ టీమ్ అంటూ సీనియర్ల తరహాలోనే వ్యవహరించి, తగిన మూల్యం చెల్లించుకుందని అంటున్నారు.

వ్యక్తిగతంగా చూస్తే ఇద్దరూ బాగానే రాణించారు. కానీ కలిసి మాత్రం ఆడలేదు. ఆదర్శ్ సింగ్ 6 మ్యాచ్ ల్లో కలిపి 191 పరుగులు చేశాడు. 31.83 సగటుతో నడిపించాడు. రెండు ఆఫ్ సెంచరీలు చేశాడు. బంగ్లాదేశ్ పై 76 పరుగులు చేశాడు.

అదే మరో ఓపెనర్ అర్షిన్ కులకర్ణి 6 మ్యాచ్ ల్లో కలిపి 181 పరుగులు చేశాడు. ఇందులో యూఎస్ ఎ మీద చేసిన సెంచరీ కూడా ఉంది. తన యావరేజ్ 31 మీద నడిచింది. మొత్తానికి ఇద్దరూ కలిసి ఫైనల్ లోనైనా ఆడి ఉంటే, మ్యాచ్ మీద హోప్స్ ఉండేదనే టాక్ నెట్టింట గట్టిగానే వినిపిస్తోంది.

Related News

Rohit Sharma Angry: 10 ఏళ్ల కుర్రాడిపై సెక్యూరిటీ దారుణం..కట్టలు తెంచుకున్న రోహిత్ శ‌ర్మ ఆగ్ర‌హం

Yashasvi Jaiswal Run Out: గిల్ సెల్ఫీష్‌, యశస్వి జైస్వాల్ ర‌నౌట్ పై వివాదం, నాటౌట్ అంటూ!

Eng-W vs SL-W: ఇవాళ శ్రీలంక వ‌ర్సెస్ ఇంగ్లాండ్ ఫైట్‌.. పాయింట్ల ప‌ట్టిక వివ‌రాలు ఇవే

Rohit Sharma Car: రోహిత్ శ‌ర్మ విధ్వంస‌ర బ్యాటింగ్‌..రూ.4.57 కోట్ల కారు ధ్వంసం

Hardik Pandya: ల‌వ‌ర్ ఫోటో లీక్ చేసిన హ‌ర్ధిక్ పాండ్యా…ఇంత‌కీ మహికా శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Rohit Sharma Tesla Car: వాడ‌కం అంటే ఎలన్ మస్క్ దే…రోహిత్ శ‌ర్మ‌ కారు నంబ‌ర్ వెనుక సీక్రెట్

Ritika Sajdeh: గంభీర్‌… నీకు కండ్లు దొబ్బాయా..నా మొగుడు ఎలా ఆడుతున్నాడో చూడు

Hardik Pandya GirlFriend: మ‌రో కొత్త పిల్ల‌ను ప‌డేసిన హార్దిక్ పాండ్యా..ఆ ఇద్ద‌రిని వ‌దిలేసి మ‌రీ !

Big Stories

×