Big Stories

Memes on Under-19 Final Match: ఆస్ట్రేలియాపై గెలవలేమా..? నెట్టింట మీమ్స్ జాతర!

Memes on INDIA to Lost Under19 World Cup: సౌతాఫ్రికాలో జరిగిన అండర్ 19 ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘోర పరాజయంపై నెట్టింట ట్రోలింగులు మొదలయ్యాయి. పెద్దోడు, చిన్నోడు ఒకే తీరులో ఉన్నారు. ఆస్ట్రేలియాతో ఫైనల్ అంటేనే టీమ్ ఇండియాకి వణుకు పుడుతోందని నెట్టింట వాయించేస్తున్నారు.

- Advertisement -

బీభత్సమైన ట్రోలింగుల బారిన టీమ్ ఇండియా యువజట్టు పడింది. అంతేకాదు మీమ్స్ కూాడా దారుణంగా పేలుతున్నాయి. టీమ్ ఇండియా సీనియర్స్ కూడా ఇలాగే వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయ్యారు. అలాగే వీళ్లు కూాాడా ఓడి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అన్నలకు ఎదురొచ్చారని ఒక రేంజ్‌లో వాయిస్తున్నారు.

- Advertisement -

పోరాడి ఓడితే పర్వాలేదు గానీ, అత్యంత దారుణంగా ఓటమి పాలవడం కరెక్టు కాదని అంటున్నారు. అత్తకొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అన్నచందంగా టీమ్ ఇండియా పరిస్థితి మారింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా మీడియా తమ యువజట్టుని ఆకాశానికెత్తేస్తోంది. పనిలో పనిగా వారు టీమ్ ఇండియాని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇది మనోళ్లకి బాగా నొప్పిగా ఉంది. దాంతో ఇండియాలో కూడా మనవాళ్లు ఆడుకోవడం మొదలుపెట్టారు.

Read More: రవీంద్ర జడేజా తండ్రి ఆరోపణలపై రివాబా స్పందన.. కామెంట్స్ వైరల్..

నిజానికి సీనియర్లు ఓడినప్పుడు అందరూ సానుభూతి వ్యక్తం చేశారు. వారి మీద ఈగవాలనివ్వలేదు. కానీ కుర్రాళ్లను మాత్రం వదిలిపెట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ఆస్ట్రేలియా-ఇండియా మధ్య ఒక పోటీ గేమ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అలాగే సినిమా క్లిప్పింగ్‌లతో మీమ్స్ ఒకదానిని మించి ఒకటి వస్తున్నాయి.

నిజానికి టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. అందుకు బదులుగా టీమ్ ఇండియా 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. 79 రన్స్ తేడాతో పరాజయం పాలైంది. కెప్టెన్ ఉదయ్ సహరన్ టోర్నమెంట్ అంతా అద్భుతంగా ఆడి, ఆడాల్సిన ఒక్క మ్యాచ్‌లో అవుట్ అయిపోయాడు. తన సహచరులు కూడా ఫైనల్ మ్యాచ్‌లో తడబడ్డారని ఉదయ్ ఒప్పుకున్నాడు. నిజానికి ఇదొక గుణపాఠం అని అన్నాడు.

అదే ఆస్ట్రేలియా కెప్టెన్ హ్యూ విబ్జెన్ మాట్లాడుతూ.. తమ జట్టు కోచ్, సిబ్బంది కారణంగానే విజయం సాధించామని అన్నాడు. హర్జాస్ సింగ్ ఆట కారణంగానే తమకు విజయం దక్కిందని అన్నాడు. ఇలా ఇటు కామెంట్లు, అటు కామెంట్లతో నెట్టింట హోరెత్తిపోతోంది.

మొత్తానికి మీమ్స్ ధాటికి టీమ్ ఇండియా కుర్రాళ్లు తలెత్తుకోలేక అవస్థలు పడుతున్నారు. పిల్లలమీద కనికరం చూపాలని, వారి స్థాయిలో అద్భుతంగా ఆడి ఫైనల్ వరకు చేరారని, అందుకు ప్రశంసించాలని మరికొందరు సీనియర్లు వ్యాక్యానిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News