E-Paper
Advertisement

Deadpool & Wolverine Teaser: మార్వెల్ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. ‘డెడ్‌పూల్ 3’ టీజర్ వచ్చేసింది!

Deadpool & Wolverine Teaser: మార్వెల్ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. ‘డెడ్‌పూల్ 3’ టీజర్ వచ్చేసింది!
Advertisement

Deadpool & Wolverine Teaser:హాలీవుడ్ సినిమాలను ఇష్టపడే సినీ ప్రియులకు గుడ్ న్యూస్. తాజాగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో అదిరిపోయే సూపర్ హీరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇప్పటికే ఈ మార్వెల్ యూనివర్స్ నుంచి వచ్చిన డెడ్‌పూల్ సిరీస్‌ సినిమాలు ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాయో అందిరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సిరీస్ నుంచి మరో సినిమా రాబోతోంది. ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’ టైటిల్‌తో మార్వెల్ స్టూడియోస్ నుంచి ఈ సినిమా వస్తుంది.

Advertisement

షాన్ లెవీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్‌మాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో గూస్ బంప్స్ తెప్పించేలా టీజర్ ఉంది. ర్యాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్‌మాన్ ఇందులో తమ నటనతో అదరగొట్టేశారు.

ముందుగా ట్రైలర్‌ ఆరంభంలో చూసుకుంటే.. ర్యాన్ రేనాల్డ్స్ తన స్నేహితులతో కలిసి బర్త్ డే వేడుకలను జరుపుకుంటాడు. ఈ లోగా కొందరు సాయుధులు వారి ఇంటికి వచ్చి ర్యాన్ రేనాల్డ్స్‌ను అలాగే హ్యూ జాక్‌మాన్‌ టీమ్‌ను కిడ్నాప్ చేసి తమ ప్రయోగశాలకు తీసుకెళ్తారు. అక్కడ హ్యూ జాక్‌మాన్, ర్యాన్ రేనాల్డ్స్ గతం గురించి వివరించడ్ మొదలు టీజర్ మొత్తం మాస్ యాక్షన్ సన్నివేశాలతో నిండిపోతుంది.

Advertisement

ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌లో తెగ వైరల్ అయిపోతుంది. రిలీజైన కొద్ది గంటల్లోనే భారీ వ్యూస్ అందుకొని దూసుకుపోతోంది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా ఈ ఏడాది జులై 26న రిలీజ్ కానుంది. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఈ సినిమా జూలైలో రిలీజ్ కానున్న తరుణంలో జూన్‌ చివరి వారంలో ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×