Football America and Mexico : కొన్ని స్పోర్ట్స్ అనేవి వైలెంట్‌గా ఉంటాయి. అవి ప్లేయర్స్‌ను గాయాలపాలు చేస్తాయి. ఎప్పటికప్పుడు కత్తి మీద సాములాగా ఉంటాయి స్పోర్ట్స్ అంటే. అంతే కాకుండా గ్రౌండ్‌లో ప్లేయర్స్ మధ్య గొడవలు కూడా సహజమే. కానీ తాజాగా అమెరికా, మెక్సికో మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జరిగిన గొడవ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్లేయర్స్ అంతా ఓపెన్‌గా అనరాని మాటలు అనుకోవడం చాలామందిని నిరాశపరిచింది. అమెరికా.. మెక్సికోపై గెలిచినా కూడా ఆ విజయం కంటే వారి గొడవే అందరికీ గుర్తుండిపోయేలా జరిగింది మ్యాచ్.
ప్రస్తుతం కొనకాఫ్ నేషన్స్ లీగ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన మ్యాచ్‌లో 3-0 తేడాతో మెక్సికోపై అమెరికా విజయం సాధించింది. కానీ ఆట జరుగుతున్నంత సేపు అక్కడ యుద్ధవాతావరణమే కనిపించింది. ఆట సెకండ్ హాఫ్‌లో జరిగిన గొడవ వల్ల నలుగురు ప్లేయర్స్‌కు రెడ్ కార్డ్ చూపించి బయటికి పంపించాల్సి వచ్చింది. ఇలా అమెరికాకు చెందిన మెక్ కెన్నీ, సెర్జినో డెస్ట్‌తో పాటు మెక్సికోకు చెందిన సీజర్ మాంటెస్, జెరార్డో ఆర్టెగాను రిఫరీ పక్కకు తొలగించారు. కొంతమంది ఈ గొడవలను సమర్థిస్తే.. చాలామంది మాత్రం గ్రౌండ్‌లో ఇలా చేయడం కరెక్ట్ కాదని వ్యతిరేకిస్తున్నారు.
90వ నిమిషానికి చేరుకున్న తర్వాత హోమోఫోబిక్ మాటలతో ప్లేయర్స్ తలపడడం వల్ల ఆటను అక్కడే ఆపివేయాల్సి వచ్చింది. మళ్లీ ప్రారంభమయిన తర్వాత కూడా ఈ పద్ధతి కొనసాగడం వల్ల బార్టన్ కూడా మ్యాచ్ నుండి తప్పుకున్నాడు. ఇప్పటికే మెక్సికోకు ఇలాంటి అనుభవం ఎదురయ్యి ఫైన్‌ను కూడా కట్టింది. అయినా కూడా తన పద్ధతిని మార్చుకోకపోవడం కరెక్ట్ కాదని ఫుట్‌బాల్ నిపుణులు విమర్శిస్తున్నారు. మెక్ కెన్నీ, సెర్జినో డెస్ట్ ప్రవర్తన వల్ల వారు ఫైనల్‌లో కూడా ఆడనిచ్చే అవకాశం లేదని తెలిపారు.
గత 23 ఏళ్లలో 3 గోల్స్‌తో అమెరికా అనేది మెక్సికోపై ఎప్పుడూ గెలవలేదు. అందువల్ల ఇది అమెరికాకు గుర్తుండిపోయే విజయం కావాల్సింది. కానీ చాలావరకు ప్లేయర్స్‌తో పాటు ఫ్యాన్స్ అటెన్షన్ కూడా వారి గొడవపైనే ఉంది. ఆట ముగిసిన తర్వాత.. వాతావరణం కాస్త చల్లబడిన తర్వాత చాలామంది ప్లేయర్స్ వారు చేసిన తప్పులను గ్రహించారు. మరింత మెరుగ్గా దాన్ని హ్యాండిల్ చేయాల్సింది అని అనుకున్నారు.