Sunil Gavaskar: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అలెన్ బోర్డర్ – భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్ల మీద ఇరుదేశాల బోర్డులు ఓ టోర్నీని నిర్వహిస్తున్నాయి. ఆ టోర్నీ పేరే.. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ. 1996 నుండి ఈ ట్రోఫీని నిర్వహిస్తున్నారు. ప్రపంచ క్రికెట్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ద్వైపాక్షిక ట్రోఫీలలో ఇది ఒకటి. ఇప్పటివరకు ఈ బోర్డర్ – గవాస్కర్ కి సంబంధించి 17 సిరీస్ లు జరగగా.. భారత్ పదిసార్లు విజేతగా నిలిచింది.
Also Read: Rishi Dhawan Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆల్ రౌండర్ !
అలాగే ఆస్ట్రేలియా ఆరుసార్లు గెలుపొందింది. ఒక సిరీస్ డ్రా గా మిగిలింది. తాజా సీజన్ లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ లో ఓ వివాదం చోటుచేసుకుంది. సిరీస్ ముగిసిన తరువాత ట్రోఫీ ఇచ్చేందుకు బోర్డర్ ను ఆహ్వానించిన నిర్వాహకులు.. అదే సమయంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ని విస్మరించారు. దీంతో ట్రోఫీని ఆస్ట్రేలియా జట్టుకు అందించడానికి ఆహ్వానించకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశాడు సునీల్ గవాస్కర్.
అక్కడే మ్యాచ్ పై విశ్లేషిస్తున్న సమయంలో తనను ఆహ్వానించకపోవడం పై తనదైన శైలిలో స్పందించాడు. ” ట్రోఫీ ప్రధాన కార్యక్రమానికి నేను కూడా రావాలనుకున్న. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ {Sunil Gavaskar} ఆస్ట్రేలియా – భారతదేశానికి సంబంధించింది. ఆ సమయంలో నేను ఇక్కడే ఉన్నాను. ఆస్ట్రేలియాకు ట్రోఫీ ఇచ్చినా పట్టించుకోను. మెరుగైన క్రికెట్ ఆడి విజయం సాధించారు.
కేవలం భారతీయుడిని కాబట్టి నన్ను ట్రోఫీ బహుకరణకు పిలవలేదేమో. నా స్నేహితుడు బోర్డర్ తో కలిసి మేమిద్దరం ఇస్తే బాగుంటుందని అనిపించింది. కానీ నాకు ఆహ్వానం లేకపోవడం నిరుత్సాహానికి గురిచేసింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే ట్రోఫీ అందజేత పై నిర్వాహకులు వారి అభిప్రాయాన్ని నాకు తెలియజేశారు. టీమిండియా ఈ మ్యాచ్ గెలవకపోయినా..? ఒకవేళ మ్యాచ్ డ్రా అయినా నా అవసరం లేదన్నారు. దీనికి నాకు బాధేం లేదు” అని వ్యాఖ్యానించారు సునీల్ గవాస్కర్.
Also Read: WTC Cycle 2025-27 Schedule: WTC 2025-27లో టీమిండియా షెడ్యూల్ వచ్చేసింది ?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రధానోత్సవానికి గవాస్కర్ ని పిలవకుండా అవమానించారంటూ భారత క్రీడాభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. మ్యాచ్ సమయంలోనే కాదు.. ఇలాంటి సమయాలలో కూడా ఆస్ట్రేలియా తీరు అభ్యంతరకరంగా ఉందని విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో మరికొందరు గవాస్కర్ ని విమర్శిస్తున్నారు కూడా. సిరీస్ ఓడిపోయి బాధలో ఉంటే..? ఈయన ట్రోఫీ అందజేస్తాడట! అని మరికొందరు విమర్శిస్తున్నారు.
Sunil Gavaskar said, “I was told just before the Test, if India didn’t win or draw the series, I wouldn’t be required to give the BGT trophy. I’m not feeling sad, but I’m just feeling perplexed. It’s the Border Gavaskar Trophy, both of us should’ve been there”. (ABC Sport). pic.twitter.com/J2MxfzXvYD
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 5, 2025