Kohli-Rohith : టీమిండియా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టమనే చెప్పాలి. ముఖ్యంగా ఏ క్రికెటర్ ఎప్పుడు ఆడుతాడో.. ఏ క్రికెటర్ ఎప్పుడూ ఆడడో అస్సలు ఊహించలేము. ప్రధానంగా 2017లో టీమిండియా (Team India) కి దూరమైన అమిత్ మిశ్రా (Amith Mishra) తాజాగా రిటైర్ మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం విదితమే. అయితే తాజాగా టీమిండియా ఆటగాళ్ల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఏంటంటే..? టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma), కీలక క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) 2027 వన్డే వరల్డ్ కప్ కి దూరం అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి వాళ్లిద్దరూ కూడా 2027 వన్డే వరల్డ్ కప్ తరువాత రిటైర్మెంట్ ప్రకటిస్తామని పలు సందర్భాల్లో చెప్పారు.
అయినప్పటికీ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా వీరిపై టీమిండియా మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్ గుప్త అభిప్రాయపడ్డారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరి కొద్ది సంవత్సరాల వరకు క్రికెట్ ఆడగలరని వెల్లడించారు. “ఏ ఆటగాడినైనా వయస్సు రిత్యా రిటైర్ అవ్వమని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు. పర్ఫామ్ చేస్తుంటే కొనసాగడంలో తప్పు ఏంటి..? ఎప్పుడూ స్టార్ట్ చేయాలో చెప్పనప్పుడు ఎప్పుడు ఆపాలో ఎలా చేస్తారు” అని ప్రశ్నించారు. మరోవైపు 2024 టీ-20 వరల్డ్ కప్ తరువాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కి ముందు టెస్ట్ క్రికెట్ కు కూడా వీరు రిటైర్మెంట్ ప్రకటించారు. వీరిద్దరూ కేవలం వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు. అదేవిధంగా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతుంటే.. విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడుతున్నారు. వన్డేల్లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
సచిన్, సెహ్వాగ్ తరువాత డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు రోహిత్ శర్మ. వారిద్దరూ కేవలం ఒక్కసారి చేస్తే.. రోహిత్ శర్మ 3 సార్లు డబుల్ సెంచరీ చేయడం విశేషం. విరాట్ కోహ్లీ నమ్మకమైన ఆటగాడిగా పేరు సంపాదించుకున్నాడు. సచిన్ టెండూల్కర్ తరువాత టీమిండియా లో అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే.. అది విరాట్ కోహ్లీ అనే చెప్పవచ్చు. వీరి గురించి సోషల్ రోజుకొక వార్త వైరల్ అవుతోంది. రోహిత్ శర్మ యోయో, బ్రాంకో టెస్టుల్లో పాస్ కాడని.. దీంతో అతన్ని రిటైర్మెంట్ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారనే వార్తలు వినిపించాయి. మరోవైపు విరాట్ కోహ్లీ అన్ని టెస్టుల్లో పాస్ అవుతాడని వార్తలు వినిపించాయి. కానీ విరాట్ కోహ్లీ ఇండియాలో యోయో, బ్రాంకో టెస్టులకు హాజరు కాలేదు. కానీ ఇంగ్లాండ్ లో హాజరైనట్టు సమాచారం. విరాట్ కోహ్లీ బ్రాంకో టెస్ట్ ఇంగ్లాండ్ లో నిర్వహించడం ఏంటి..? టీమిండియా ఆటగాళ్లందరికీ బెంగళూరులో నిర్వహిస్తే.. అతనికి ఒక్కడికి అక్కడ ఎందుకు నిర్వహిస్తున్నారనే వాదనలు వినిపించాయి.