Nagarkurnool Incident: బంగారం లాంటి అందమైన కుటుంబం.. చూడచక్కనైన ముగ్గురు పిల్లలు..అంత బాగుంది అన్న టైమ్ లో తీరని విషాదం.. నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. ఉప్పునుంతల దగ్గర ఇద్దరు చిన్నారుల పూర్తిగా దహనమైన స్థితిలో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అంతేకాకుండా పెద్దాపూర్ దగ్గర చిన్నారుల తండ్రి మృతదేహం లభ్యమైంది. పురుగుల మందు తాగి తండ్రి వెంకటేశ్వరులు ఆత్మహత్య చేసుకున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే..
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్రగేట్ సమీపంలో కీలక గటన చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వరులు గత నెల 30 న కుటుంబ కలహాలతో తన ముగ్గురు పిల్లలని బైకుపై ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ రహదారి నుంచి తెలంగాణ వైపుకు వచ్చాడు. వెల్దండ మండలం ఉప్పునుంతల సమీపంలోని పెద్దాపూర్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో నాగర్‌కర్నూల్ పోలీసులు, ఉప్పునుంతల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఒకవైపు తండ్రి మృత దేహం లభించినప్పటికి.. ముగ్గురు పిల్లల ఆచూకి దొరకకపోవడంతో.. ఉప్పునుంతల పోలీసులు వెతుకుతుండగా సమీపంలోని గుట్టా ప్రాంతంలో ఇద్దరు పిల్లలు వర్షిణి, శివధర్మ.. వీరిద్దరిని పూర్తిగా చంపేసి.. ఆ తర్వాత పెట్రోల పోసి తగలపెట్టేశాడని పోలీసులు గుర్తించారు. కానీ ముఖ్యంగా ఇంకా పెద్ద కేమార్తే మోక్షితకు సంబంధించిన జాడ కనిపించలేదు..
Also Read: దూసుకొస్తున్న UFO! భూమిపై ఏలియన్స్ దాడి.. ఎప్పుడంటే!
అయితే 4 సంత్సరాల కుమారుడు, 6 సంవత్సరాల చిన్న కుమార్తే.. అదేవిధంగా 8 సంవత్సరాలు ఉన్న పెద్ద కుమార్తే ఇప్పటి వరకు లభ్యం కాలేదు. అయితే పోలీసులు అక్కడి గుట్ట సమీప ప్రాంతంలో డ్రోన్ల సహాయంతో వెతుకుతున్నాట్టు తెలిపారు. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ కలహాలు కారణం.. భార్యతో తరచూ గొడవలు కావడం వల్లే ఇదంతా చోటు చేసుకుంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే డిండి పరిసరాల్లో కూడా ఈ తండ్రి పిల్లలు సంచరించారు. ఇప్పుడు మోక్షిత కేడా సూర్యతాండ ప్రాంతాల్లో ఆమె మృత దేహం కూడా కనిపించినట్టు సమాచారం తెలిపారు పోలీసులు. కానీ ఇంత దారుణంగా అభం.. శుభం.. తెలియని పిల్లల్ని చంపి, అతను కూడా చనిపోడానికి అంత బలమైన కారణం ఏై ఉంటుంది అనే కోణంలో విచారిస్తున్నారు. అంతేకాకుండా భార్యతో గొడవపడితే తాను ఒక్కడే ఆత్మహత్య చేసుకుంటాడు.. కానీ ముగ్గురు పిల్లలని ఎందుకు అంతా దారుణంగా చంపేశాడు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.