E-Paper
Advertisement

అద్దెకు ‘ప్రేయసి’.. ఒక్కో పనికి ఒక్కో రేటు.. ఎక్కడో కాదు మన ఇండియాలోనే!

అద్దెకు ‘ప్రేయసి’.. ఒక్కో పనికి ఒక్కో రేటు.. ఎక్కడో కాదు మన ఇండియాలోనే!
Advertisement

Rent Me For A Day Trend: ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో రోజుకో కొత్త ట్రెండ్ పుట్టుకొస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక సరికొత్త సర్వీస్.. నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. ‘రెంట్ మీ ఫర్ ఏ డే’ (నన్ను ఒక రోజుకు అద్దెకు తీసుకోండి) పేరుతో సాగుతున్న ఈ ధోరణి.. పెయిడ్ కంపానియన్‌షిప్ (డబ్బులిచ్చి తోడుని పొందడం), గిగ్ ఎకానమీ, సమాజంలో మారుతున్న మానవ సంబంధాలపై సరికొత్త చర్చను లేవనెత్తింది.

డేటింగ్‌కు రూ.1500

ఎక్స్ యూజర్ నళిని ఉనగర్ షేర్ చేసిన ఒక రేట్ కార్డ్ ప్రస్తుతం ఈ దుమారానికి కారణమైంది. ఆ పోస్ట్ ప్రకారం.. ‘దివ్య’ అనే యువతి క్లయింట్‌లకు తోడుగా ఉండేందుకు ఎంతెంత ఛార్జ్ చేస్తుందో ఆ లిస్టులో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ రేట్ కార్డ్ ప్రకారం.. కేవలం ఒక సాదాసీదా కాఫీ డేటింగ్‌కు రూ. 1,500, డిన్నర్ అండ్ సినిమా ప్యాకేజీకి రూ. 2,000 వసూలు చేస్తున్నారు. ఒకవేళ క్లయింట్ తన కుటుంబ సభ్యులను కలవడానికి తీసుకువెళ్లాలంటే రూ. 3,000, ఏదైనా ఈవెంట్‌కు తోడుగా వెళ్లడానికి రూ. 3,500 ధర నిర్ణయించారు. బైక్ రైడ్‌కు రూ. 4,000 కాగా.. ఈ డేటింగ్‌ను దివ్య తన పబ్లిక్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయాలనుకుంటే ఏకంగా రూ. 6,000 చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

కస్టమర్లకు స్పెషల్ ప్యాకేజీలు

ఇవే కాకుండా కొన్ని ప్రత్యేక ఆప్షనల్ ప్యాకేజీలు కూడా అందులో ఉన్నాయి. అడ్వెంచర్ డేకి రూ.5,000, కలిసి వంట చేయడానికి రూ. 3,500, షాపింగ్‌కు రూ. 4,500, అలాగే రెండు రోజుల వీకెండ్ ట్రిప్ కోసం రూ. 10,000 గా ధరలు ఖరారు చేశారు. క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా ప్లాన్లను మార్చుకునే వెసులుబాటు (కస్టమైజ్డ్ ప్లాన్స్) కూడా ఉందని ఆ పోస్టులో ఉంది.

రోజుకు రూ.7 వేల సంపాదన

Advertisement

‘రెంటల్ గర్ల్‌ఫ్రెండ్స్’ అంశంపై ‘మిక్కు’ అనే మరో ఎక్స్ యూజర్ స్పందిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో ఈ ట్రెండ్ ఎలా ఉందో వివరించారు. అక్కడ యువతులు ‘రెంటల్ గర్ల్‌ఫ్రెండ్స్’ (అద్దె ప్రేయసి)గా మారుతూ భారీగా సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. ‘దిల్లీ అమ్మాయిలు గర్ల్‌ఫ్రెండ్ రెంటల్ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించి ఉచితంగా ఆహారం, షాపింగ్ పొందడమే కాకుండా కేవలం అబ్బాయిలతో సమయం గడిపినందుకు గంటకు రూ.1,000 వరకు సంపాదిస్తున్నారు. రోజుకు 3 నుండి 4 బుకింగ్స్ ద్వారా వారి రోజూవారీ ఖర్చులు, షాపింగ్ అవసరాలు తీరడమే కాకుండా రోజుకు రూ. 6,000 నుండి 7,000 వరకు ఆర్జిస్తున్నారు’ అని ఆయన రాసుకొచ్చారు.

రెంటల్ గర్ల్ స్పందన ఇదే

రెంటల్ గర్ల్స్ కు సంబంధించి మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. అందులో ఒక యువతి తానే స్వయంగా రెంటల్ గర్ల్‌ఫ్రెండ్‌గా చేస్తున్నట్లు చెబుతూ.. దేశంలోనే అతిపెద్ద రెంటల్ కంపానియన్ ప్లాట్‌ఫామ్ అయిన ‘KoPartner.in’ ద్వారా తనకు ఆర్డర్లు వస్తున్నాయని తెలిపింది. ‘ఇక్కడ అబ్బాయిలు షాపింగ్, సినిమాలు, ప్రయాణాల కోసం అమ్మాయిలను రెంట్ చేసుకుంటారు’ అని ఆమె వివరించింది. ఒక క్లయింట్‌తో 2 గంటలు గడిపానని.. తన ఎమోషనల్ స్టోరీస్ విని అతడు షాపింగ్ చేయించడమే కాక చివర్లో రూ.2,000 ఫీజు కూడా అదనంగా చెల్లించినట్లు వీడియోలో చూపించారు.

Also Read: వాషింగ్ మిషన్ డోర్ తెరిచి ఉంచితే.. ఎంత లాభమో తెలుసా? ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యారు!

నెటిజన్ల భిన్నాభిప్రాయాలు

అయితే ఈ సరికొత్త ట్రెండ్ పై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని గిగ్ ఎకానమీలో భాగమైన ఒక ఆధునిక ఉపాధి అవకాశంగా అభివర్ణిస్తున్నారు. మరికొందరు సమాజంలో పెరుగుతున్న ఒంటరితనం, భద్రత, దోపిడీ కోణాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక నెటిజన్ సరదాగా స్పందిస్తూ ‘దీనిని ఒక యాప్ రూపంలోకి తెస్తే మిలియన్ డాలర్ల బిజినెస్ అవుతుంది’ అని జోక్ చేశారు. మరొకరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ‘ఇది నిజంగా పిచ్చితనం’ అని వ్యాఖ్యానించారు. మెుత్తం మీద మనుషుల మధ్య బంధాలు, తోడు కూడా ఇలా వాణిజ్యమయం కావడం నేటి సామాజిక పోకడలకు అద్దం పడుతోందని నిపుణులు భావిస్తున్నారు.

Also Read: రూ.448 vs రూ.548.. సామాన్యుల కోసం జియో, ఎయిర్‌టెల్ బడ్జెట్ ప్లాన్స్!

Related News

తీవ్ర జ్వరం, శరీరంపై దద్దుర్లు కనిపిస్తున్నాయా? చికెన్ పాక్స్ లక్షణాలు కావచ్చు.. ఇలా తెలుసుకోండి

బాత్రూమ్‌లో చేసే ఈ 7 తప్పులు ఇంట్లో సమస్యలకు కారణం.. ఆర్థిక కష్టాలకు ఆహ్వానం

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.. ఈ తేదీల్లో పుట్టినవారు టెన్షన్ తీసుకోరు, ఎప్పుడూ సంతోషంగా ఉంటారు

ఆఫీస్‌కు వెళ్లే మహిళల కోసం 4 స్టైలిష్ డ్రెస్ ఐడియాలు.. అందరి చూపు మీ పైనే

కార్డియో లేదా వెయిట్ ట్రైనింగ్.. జిమ్‌లో ఏది ముందు చేయాలి? డాక్టర్స్ చెప్పిన సమాధానమిదే

ఇండక్షన్ స్టవ్‌పై పాలు వేడి చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే కరెంట్ షాక్ ప్రమాదం

‘గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్’.. డాక్టర్ దిలీప్ అనూహ్య పోరాటం!

Big Stories

Advertisement
×