BigTV English

Gavaskar On RCB : 18 ఏళ్లు ఏం పీకారు? బెంగళూరు తొక్కిసలాటపై గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు

Gavaskar On RCB : 18 ఏళ్లు ఏం పీకారు? బెంగళూరు తొక్కిసలాటపై గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు

Gavaskar On RCB : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2025 ఐపీఎల్ సీజన్ టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ  సందర్భంగా చిన్న స్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ విజయోత్సవ వేడుకల్లో జరిగిన తొక్కిసలాట కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట గురించి భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఆర్సీబీ అభిమానులు తమ ప్రాణాలను కోల్పోవడం ‘హృదయ విదారకంగా’ ఉందని అన్నారు. తమ అభిమాన జట్టు ట్రోఫీని ఎగురవేసేందుకు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోవడం అర్థం చేసుకోదగినది అని.. దానికి ఎవరికైనా నిందించడం ఇప్పుడు వ్యర్థ్యం అని పేర్కొన్నాడు.


Also Read : Watch Video : ఈ బుడ్డోడు ఏంట్రా.. బుమ్రానే మించిపోయాడు.. ఆ యార్కర్ కు వికెట్ ఎగిరిపోయిందిగా

చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోవడం నిజంగా నిజంగా హృదయ విదారకంగా  ఉందని గవాస్కర్ తెలిపాడు. ముఖ్యంగా ఆ ప్రజలు కోరుకునేది సంవత్సరాలుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ సాధించలేదని.. గత రెండు నెలల నుంచి తమకు చాలా సంతోషం, ఆనందం కలిగించిందని తెలిపారు. అయితే కొంత మంది చనిపోవడం.. మరికొంత మంది గాయపడటం, ఆసుపత్రిలో చికిత్స పొందడం ఓ విషాదకరమైన ఘటన అన్నారు. ఇందులో ఎవ్వరినీ నిందించినా ప్రయోజనం లేదని.. జీవితాలను తిరిగి తీసుకురాలేము.. కొన్ని గాయాలు ఎప్పటికీ సరిగ్గా నయం కావని.. మానసికమైనవని తెలిపారు. మరోవైపు ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్స్ సందర్భంగా బెంగళూరులో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పై బీసీసీఐ కూడా ఇటీవలే స్పందించింది. ముఖ్యంగా సెలబ్రేషన్స్ సరిగ్గా ప్లాన్ చేసి ఉండాల్సింది అంటూ ఆర్సీబీ మేనేజ్ మెంట్ పై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది.


వాస్తవానికి 18 సంవత్సరాల తరువాత ఆర్సీబీ తొలిసారిగా ఐపీఎల్ గెలిచినందున బెంగళూరులో ఇది చిరస్మరణీయమైన రోజుగా భావించారు. కానీ వేడుకలు విషాదాన్ని మిగిల్చాయి. ఛాంపియన్ జట్టును వీక్షించేందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల దాదాపు 2 లక్షల మంది అభిమానులు గుమిగూడారు. పోలీసులు భారీ జనసమూహాన్ని నియంత్రించలేకపోయారు. దీంతో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఇది చాలా దురదృష్టకరం. ప్రజలు క్రికెటర్ల పట్ల పిచ్చిగా ఉన్నారు. అసలు ఇంత పెద్ద విజయోత్సవ వేడుకలను నిర్వహించేటప్పుడు సరైన జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోవాలి. ఎక్కడో కొన్ని లోపాలు ఉన్నాయి. ఐపీఎల్ ఇంత అద్భుతంగా ముగిసిన తరువాత ఇది యాంటీ క్లైమక్స్ అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై, కోల్ కతా వంటి జట్లు గెలిచినప్పటికీ విజయోత్సవ సంబురాలు పలు జాగ్రత్తలతో జరుపుకున్నార. పద్దెనిమిదేళ్ల తరువాత టైటిల్ సాధించడం.. బెంగళూరులో విరాట్ కోహ్లీ అభిమానులు భారీగా తరలిరావడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని పలువురు పేర్కొనడం విశేషం. 

 

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×