Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ram Charan Tej)ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ రామ్ చరణ్ మాత్రం తన నటనతో తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకోవడమే కాకుండా, RRR సినిమాతో తండ్రికి మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలను కూడా సొంతం చేసుకున్నారు.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల వద్దకు రావడమే కాకుండా ఈ సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు(Oscar Award) రావడంతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు పొందారు. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్స్ అన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఇకపోతే ఇటీవల చరణ్ శంకర్ డైరెక్షన్లో నటించిన గేమ్ చేంజర్(Game Changer) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం చేరుకోలేక మెగా అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో “పెద్ది” (Peddi)అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఈయన తదుపరి ప్రాజెక్టు సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా చేయబోతున్నారట వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఇలా రామ్ చరణ్ లైనప్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో చరణ్ సినిమాలకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
ఎన్టీఆర్ చేయాల్సిన కథ…
రామ్ చరణ్ కమిట్ అయిన సినిమాలన్నీ కూడా ఇతర హీరోలు రిజెక్ట్ చేసినవే అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా కథను డైరెక్టర్ ముందుగా ఎన్టీఆర్ కు వినిపించి ఎన్టీఆర్ తో చేయాలని అనుకున్నారట. అది సాధ్యం కాకపోవడంతో రామ్ చరణ్ వద్దకు వెళ్లారని తెలుస్తోంది.
సెకండ్ హ్యాండ్ సినిమాలు…
ఇకపోతే డైరెక్టర్ సుకుమార్ కూడా రామ్ చరణ్ తో చేయాలనుకున్న సినిమా కథ మొదటగా విజయ్ దేవరకొండ వద్దకు వెళ్లిందని, కొన్ని కారణాలవల్ల ఈ కాంబినేషన్ సెట్ కాకపోవడంతో రామ్ చరణ్ తో సుకుమార్ కమిట్ అయ్యారని తెలుస్తుంది. ఇకపోతే తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో కూడా రామ్ చరణ్ నటించబోతున్నారని వార్తలు బయటకు వచ్చాయి. ఇక త్రివిక్రమ్ మొదటగా ఈ కథతో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనుకున్నారట. ఇక పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడం కుదరని నేపథ్యంలోనే రామ్ చరణ్ కు ఆ కథ వినిపించారంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇలా రామ్ చరణ్ చేసే సినిమాలన్నీ కూడా ఒక హీరో రిజెక్ట్ చేసినవి అని తెలియడంతో చరణ్ కమిట్ అయిన సినిమాలన్నీ కూడా సెకండ్ హ్యాండ్ సినిమాలే, మాకు ఇదేం కర్మ రా బాబు అంటూ అభిమానులు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.