Gianluigi Donnarumma Injury: ప్రపంచవ్యాప్తంగా…. క్రికెట్ చూసేవారు చాలామంది ఉంటారు. అయితే క్రికెట్ కంటే.. ఫుట్బాల్ పైన… ఇంట్రెస్ట్ ఎక్కువమంది చూపిస్తూ ఉంటారు. మనదేశంలో క్రికెట్ తప్ప ఏ మ్యాచ్ లు చూడరు. కానీ విదేశాల్లో ఫుట్బాల్ ఆటకు ఉన్న క్రేజ్ అంతా కాదు. ఈ ఫుట్బాల్ లో… ఒకరిపై ఒకరు ప్రతికారం తీర్చుకునేందుకు గ్రౌండ్లోనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా బంతి కోసం రెండు జట్ల ప్లేయర్లు తలపడుతూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో చాలామంది ప్లేయర్లకు గాయాలు కూడా అవుతాయి.
Also Read: Mohammed Rizwan Haris Rauf: SRH ప్లేయర్ ను కెలికిన పాక్ క్రికెటర్లు.. మ్యాచ్ మధ్యలో గొడవ
అయితే గ్రౌండ్లో ఓవరాక్షన్ చేసిన ప్లేయర్లపై ఆంక్షలు కూడా విధిస్తారు. అచ్చం అరె జక్కన్న దర్శకత్వంలో వచ్చిన సై సినిమా తరహాలో… ఫుట్బాల్ కూడా జరుగుతుంది. అయితే సరిగ్గా… ఇలాంటి సంఘటనే తాజాగా చోటుచేసుకుంది. ఓ ఫుట్బాల్ ప్లేయర్కు తీవ్రమైన గాయమైంది. గోల్ఫ్ కీపర్… ముఖం పగిలిపోయింది. ప్యారిస్ సెయింట్ జర్మన్ జట్టుకు సంబంధించిన గోల్స్ కీపర్ జాలుయిజి డోన్నరుమ్మా ( Gianluigi Donnarumma ) అనే యంగ్ ప్లేయర్ ముఖం పగిలింది.
25 సంవత్సరాలు ఉన్న జాలుయిజి డోన్నరుమ్మా… మొనాకో ప్లేయర్ చేతిలో గాయపడ్డాడు. గోల్ కోసం ప్రయత్నించిన… మొనాకో డిఫెండర్ విల్ఫ్రైడ్ సింగో ( Wilfried Singo )… కాలి షూకు తగిలి… డోన్నరుమ్మా.. ముఖం పగిలింది. దీంతో అతడు గ్రౌండ్ లోనే కుప్పకూలాడు. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. విల్ ప్రైడ్ సింగో… డిఫెండింగ్ చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో అతన్ని… ఆపే ప్రయత్నం చేశాడు గోల్ఫ్ కీపర్ డోన్నరుమ్మా ( Gianluigi Donnarumma ).
కానీ డిపెండర్ విల్ ప్రైడ్ సింగో… ఎక్కడ తగ్గలేదు. ఎదురు దాడి చేసి మరి… బంతిని తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే అనుకోకుండా… గోల్ఫ్ కీపర్ డోన్నరుమ్మా డౌన్ అయ్యాడు. దీంతో సింగో కాలు గట్టిగా తగిలింది. ఈ నేపథ్యంలోనే… డోన్నరుమ్మా కుడి రైట్ దవడ పగిలిపోయింది. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యం అందిస్తున్నారు.
Also Read: Australia Squad: చివరి రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన ఆసీస్..ఆ డేంజర్ ప్లేయర్ ఔట్!
అయితే తన ఆరోగ్యం బాగానే ఉందని… ఎవరు టెన్షన్ పడకూడదని గోల్ఫ్ కీపర్ డోన్నరుమ్మా… కీలక ప్రకటన కూడా చేశారు. ఇందులో ప్రత్యర్థి తప్పు లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఎవరు ఆందోళన చెందకూడదని కోరారు. మళ్లీ గ్రౌండ్లో అడుగుపెడతానని…డోన్నరుమ్మా ( Gianluigi Donnarumma ) పేర్కొనడం జరిగింది.
ఇక గోల్స్ కీపర్ డోన్నరుమ్మాకు గాయం కావడంపై… సింగో పశ్చాత్తాప పడ్డాడు. బాధిత ప్లేయర్కు క్షమాపణలు కూడా చెప్పారు. అనుకోకుండా జరిగిన సంఘటనలో… డోన్నరుమ్మాకు ( Gianluigi Donnarumma ) గాయం అయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంలో తనను క్షమించాలని కోరాడు.
#GianluigiDonnarumma‘s position in the #Monaco vs #PSG match where he was injured and had to leave the game.#Ligue1 | #ParisSaintGermain | #WilfriedSingo
— Footbalyze (@Gokturk_Tamay) December 19, 2024