RT76 Update : సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమాలకు ఏ స్థాయిలో రెస్పాన్స్ ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే చాలామంది దర్శక నిర్మాతలు తమ సినిమాలను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఒక ఏడాది కాలం ముందు నుంచి సంక్రాంతికి తమ సినిమాలను రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఈ ఏడాది సంక్రాంతి విషయానికి వస్తే అనిల్ రావిపూడి ఒక అడుగు ముందుకు వేసి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ కూడా పెట్టి సినిమా చేసి రిలీజ్ చేశాడు. గత కొన్ని సంవత్సరాలుగా బాక్స్ ఆఫీస్ వద్ద చాలా సినిమాలు పోటీ పడుతూ వెనక్కు తగ్గిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకనే ముందుగానే సంక్రాంతి సీజన్ లో తమ సినిమాలు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉంటారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి సినిమా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో కూడా దాని గురించి అధికారిక ప్రకటన రానుంది.
ఇకపోతే మాస్ మహారాజా రవితేజ తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అందులో భాగ్యశ్రీ తో పాటు మరో హీరోయిన్ ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా హీరోయిన్స్ ఫిక్స్ కాలేదు అని తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఏప్రిల్ లేదా మే నుంచి మొదలుకానుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్లాన్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈసారి మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా సంక్రాంతి బరిలో పోటీకి సిద్ధంగా ఉంటాడు.
Also Read : Rc16 Update: బ్రేకులు , గ్యాప్ లు లేవు , రంగస్థలం రేంజ్
దర్శకుడు తిరుమల కిషోర్ నేను మీకు తెలుసా సినిమాతో డైలాగ్ రైటర్ గా అడుగుపెట్టి సెకండ్ హ్యాండ్ సినిమాతో దర్శకుడుగా మారాడు. రామ్ పోతినేని హీరోగా చేసిన నేను శైలజ సినిమా కిషోర్ తిరుమల కు దర్శకుడుగా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత చేసిన ఉన్నది ఒకటే జిందగీ సినిమా మంచి హిట్ అయింది. సాయి తేజ లో ఇప్పటికీ హిట్ సినిమాగా చెప్పుకొని చిత్రలహరి సినిమాకి కూడా దర్శకత్వం వహించాడు కిషోర్ తిరుమల. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన రెడ్, ఆడవాళ్లు మీకు జోహార్లు ఈ రెండు సినిమాలు ఊహించిన సక్సెస్ సాధించలేకపోయాయి. ఇక ప్రస్తుతం రవితేజతో సినిమా చేసి మంచి కం బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కిషోర్ తిరుమల. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
Also Read: The RajaSaab Update: 3 సాంగ్స్ షూట్ బ్యాలెన్స్ , టీజర్ రిలీజ్ అయ్యేది అప్పుడే