E-Paper
Advertisement

IPL 2026-Google Gemini: IPL కోసం రంగంలోకి జెమిని AI..ఏకంగా రూ.270 కోట్లు పెట్టి మ‌రీ

IPL 2026-Google Gemini: IPL కోసం రంగంలోకి జెమిని AI..ఏకంగా రూ.270 కోట్లు పెట్టి మ‌రీ

IPL 2026-Google Gemini:  ఐపీఎల్ అభిమానులకు బిగ్ అలర్ట్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం రంగంలోకి గూగుల్ కు చెందిన జెమిని ఏఐ దిగింది. ఐపీఎల్ కౌన్సిల్ తో జెమినీ ఏఐ కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపై టాటా తర్వాత అతిపెద్ద స్పాన్సర్ గా ఐపిఎల్ లో ( IPL) కొనసాగనుందట గూగుల్ జెమినీ. మూడు సంవత్సరాల పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలితో ( Board of Control for Cricket in India )  జెమినీ ( Google’s AI platform Gemini ) ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికోసం ఏకంగా 270 కోట్లు పెట్టిందట గూగుల్ జెమిని. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: Shoaib Malik Retirement: పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ‌..PSL 2026 ప్రారంభాని కంటే ముందే షోయబ్ మాలిక్ రిటైర్మెంట్‌

ఐపీఎల్ కోసం రంగంలోకి గూగుల్ జెమిని

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మార్చి 25వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ 2026 ఐపిఎల్ టోర్నమెంట్ నుంచి 2028 వరకు అంటే మూడు సీజన్ల పాటు స్పాన్సర్ షిప్ ఒప్పందం ( IPL Sponsorship Deal ) బీసీసీఐతో కుదుర్చుకుందట జెమినీ ఏఐ. మొత్తం 270 కోట్లు పెట్టి.. బిసిసిఐ తో డీలింగ్ కుదుర్చుకుందట. అంటే ఐపిఎల్ 2026, 2027,2028 ఇలా మూడు సీజన్ల కోసం 90 కోట్ల చొప్పున మొత్తం 270 కోట్లు ఖర్చు చేసింది జెమినీ AI ( Google Gemini ) అయ్యాయి.

ఇండియన్ మార్కెట్ పై ఫోకస్ చేసేందుకు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిందట గూగుల్. అయితే ఇందులో టాటా గ్రూప్ మాత్రం టైటిల్స్ స్పాన్సర్ గా కొనసాగుతోంది. 2024 నుంచి 2028 అంటే ఐదు సంవత్సరాల పాటు ఐపిఎల్ టోర్నమెంట్ టైటిల్స్ స్పాన్సర్ గా హక్కులను సొంతం చేసుకుంది టాటా గ్రూప్ ( TATA Group). దీనికోసం ఏకంగా 2500 కోట్లు పెట్టి రంగంలోకి దిగింది. ఇక ఇప్పుడు ఇతర విభాగాలకు జెమినీ ఏఐ స్పాన్సర్ గా ఉండనుంది. అంటే ఐపిఎల్ లో అసోసియేట్ స్పాన్సర్ గా వ్యవహరిస్తుంది జెమినీ AI ( Google Gemini ).

గూగుల్ జెమిని AI ఎందుకు రంగంలోకి దిగింది ?

2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్  ( 2025 Indian Premier League Tournament ) వరకు టాటా తో పాటు ఇతర కంపెనీలు స్పాన్సర్లుగా ఉన్నాయి. అవన్నీ బెట్టింగ్, గేమింగ్ యాప్స్. అయితే వీటన్నిటిపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించింది. డ్రీమ్ ఎలెవన్ , my 11 సర్కిల్ లాంటివి ఇండియాలో బ్యాన్ అయిపోయాయి. దీంతో వీటన్నిటి స్థానంలో ఇప్పుడు జెమినీ ఏఐ రంగంలోకి దిగింది. కాగా, 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ మార్చి 25వ తేదీ నుంచి మే 31వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

 

Also Read: Rinku Singh AI Video Controversy: దేవుళ్ల‌పై ఆ పోస్టులు…రింకు సింగ్ అరెస్ట్ కు రంగం సిద్ధం..అస‌లు ఏంటి ఈ వివాదం ?

 

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×