Murder in Kurnool TDP Leader to Death(AP political news): కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పత్తికొండ మండలంలోని హోసూరులో టీడీపీ నేతను దుండగులు అతికిరాతంగా నరికి చంపేశారు. టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు ఉదయం బహిర్భూమికి వెళ్తుండగా..గ్రామ శివారులో అప్పటికే రెక్కి కాస్తున్న దుండుగులు ఆయన రాగానే ఒక్కసారిగా దాడిచేశారు. ప్రణాళికతో వచ్చిన దుండగులు కళ్లలో కారం పొడి చల్లి వేట కొడవళ్లతో దారుణంగా నరికారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఎవరిపైనా అనుమానం ఉందా? అనే కోణంలో విచారణ చేపట్టారు.
టీడీపీ మాజీ సర్పంచ్ హత్య ఘటనపై టీడీపీ నాయకులు స్పందించారు. టీడీపీ విజయాన్ని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, శ్రీనివాసులు గత ఎన్నికల్లో టీడీపీ తరఫున చురుకుగా పనిచేసినందుు కిరాతంగా హతమార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసీపీ మూకలే చంపేశారని, ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు లోకేశ్ చెప్పారు.
ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్ష్యతో శ్రీనివాసులు కళ్లలో కారం కొట్టి కిరాతంగా హతమార్చారని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో తిరస్కరణకు గురైనా జగన్ అండ్ కో తమ పాత పంథాను మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావించకూడదన్నారు. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. బాధితుడికి టీడీపీ అండగా ఉంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు.
Read Also: ఏపీలో పరువు హత్య.. మైనర్ బాలిక పెళ్లి చేసుకుందని ఇంటికి తీసుకొచ్చి.. ఆపై..
ఈ ఘటనపై టీడీపీ నాయకులు సైతం స్పందించారు. వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఇటీవల ఎన్నికల్లో హూసూరు గ్రామంలో టీడీపీకి భారీ మెజార్టీ రావడంతో నే శ్రీనివాసులును హత్య చేశారని ఆరోపిస్తున్నారు.