Khali: దిలీప్ సింగ్ రానా.. అనే పేరు వినగానే ఇతను ఎవరో మీలో చాలామందికి తెలియక పోవచ్చు. కానీ ఒకప్పుడు వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ {డబ్ల్యుడబ్ల్యుఈ} రింగ్ లో రెజ్లింగ్ చేసిన మన దేశానికి చెందిన గ్రేట్ ఖలీ అంటే అందరికీ ఇట్టే గుర్తొస్తుంది. డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్ లో ఎంతోమంది ప్రత్యర్ధులను చితకబాదాడు ఖలి. 2000 సంవత్సరంలో తన రెజ్లింగ్ కెరీర్ ని ప్రారంభించిన ద గ్రేట్ ఖలీ.. సిడబ్ల్యూఈ, డబ్ల్యూసిడబ్ల్యూ, ఎన్జేపీడబ్ల్యూ, డబ్ల్యూడబ్ల్యూఈ వంటి రెజ్లింగ్ కంపెనీలలో రెజ్లర్ గా పనిచేశాడు.
ఈ క్రమంలో 2007-2008 మధ్యకాలంలో డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ అయ్యాడు. అలాగే డబ్ల్యుడబ్ల్యుఈ హాల్ ఆఫ్ ఫేమ్ గా క్లాస్ ఆఫ్ 2021 లో ఎంపికయ్యాడు. అనంతరం హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో, బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా కనిపించాడు. ఇక 2018 ఏప్రిల్ 27న తన రెజ్లింగ్ కెరీర్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చాడు. 2022లో బిజెపి పార్టీ ప్రధాన కార్యాలయంలో బిజెపి కండువా కప్పుకున్నాడు.
పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఖలి భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఖలీ తండ్రి పేరు జ్వాలా సింగ్. అతడి తల్లి తండీ దేవి. వీరికి ఏడుగురు కుమారులు. అందులో ఖలీ ఒకరు. హిమాచల్ ప్రదేశ్ కి చెందిన ఖలీ.. భారతదేశంలోనే కాకుండా విదేశాలలోనూ పేరుగాంచాడు. అయితే డబ్ల్యుడబ్ల్యుఈ కి గుడ్ బై చెప్పిన అనంతరం భారత్ కి తిరిగి వచ్చిన ఖలీ.. ప్రస్తుతం భారతదేశంలో రెజ్లింగ్ ని ప్రమోట్ చేస్తున్నాడు.
అంతేకాకుండా సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ, అప్పుడప్పుడు పలు షాపింగ్ మాల్స్, ఇతర వాణిజ్య సంస్థల ప్రారంభోత్సవాలకు హాజరవుతున్నాడు. దాదాపు 7.1 అడుగుల ఎత్తు, 157 కేజీల బరువుతో చూస్తేనే ఎవరినైనా భయపెట్టేలా కనిపిస్తాడు. ఈయన డబ్ల్యూడబ్ల్యూఈ లో హండర్ టేకర్ ని ఓడించి అప్పట్లో సంచలనం సృష్టించాడు. రెజ్లింగ్ రింగ్ లో తన ఒంటి చేత్తో ప్రత్యర్థి తలపై ఒకే వేటుతో వారిని నేలకూల్చడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య.
అయితే తాజాగా ది గ్రేట్ ఖలీ చేసిన ఓ పని నెట్టింట వైరల్ గా మారింది. ఓ చెట్టు నరుకుతూ ఖలీ ఇంస్టాగ్రామ్ లో ఓ రీల్ ని పోస్ట్ చేశాడు. దీంతో ఖలీ కి ఏమైంది.. అలా చెట్టును ఎందుకు నరుకుతున్నాడంటూ ఆశ్చర్యపోయారు ఆయన అభిమానులు. కానీ అతడు ఆ చెట్టును నరుకుతుంది చేత్తో. ఇలా ఎందుకు చేశాడంటే.. రెజ్లింగ్ రింగ్ లో అదే చేతితో.. ఒక్క షాట్ తోనే ఎంతోమంది ప్రత్యర్థులను మట్టికరిపించాడు ఖళీ. తాజాగా అదే షాట్ ని ఓ చెట్టుపై ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఖలీ పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">