Siraj Washington Sundar: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తిరుగులేదని. 300 పరుగులు చేస్తారని అభిమానులంతా భావించారు. అభిమానుల కోరిక మేరకు తొలి మ్యాచ్ లో భయంకరమైన బ్యాటింగ్ చేసింది SRH. ఇక తొలి మ్యాచ్ తరువాత వరుస ఓటమిలను చవి చూసింది. దీంతో సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న రాత్రి గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ మాజీ ఆటగాళ్లు గట్టి దెబ్బ తీశారు. గత సీజన్ వరకు SRHలోనే ఉన్న వాషింగ్టన్ సుందర్ 29 బంతుల్లోనే 49 రన్స్ తో లక్ష్య ఛేదనను సులువుగా మార్చేశాడు. అటు ఒకప్పటి రైజర్స్ సిరాజ్ బౌలింగ్ లో 4 వికెట్లు తీసి హైదరాబాద్ బ్యాటింగ్ వెన్ను విరిచాడు. వీరిద్దరూ మన వద్ద ఉన్నప్పుడు ఎందుకు ఇలా ఆడలేదంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
మరోవైపు హైదరాబాద్ కి చెందిన సిరాజ్ గత సీజన్ లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టులో ఆడాడు. మొన్న గుజరాత్ వర్సెస్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా సిరాజ్ కీలక వికెట్లు తీసి ఆ జట్టు ఓడిపోవడానికి కారకుడయ్యాడు. దీంతో బెంగళూరు అభిమానులు సైతం సిరాజ్ ను జట్టులోనే ఉంచుకొని ఉంటే మరింత బలం అయ్యేది అని పేర్కొనడం విశేషం. SRH కీలక బౌలర్ భువనేశ్వర్ ని సైతం యాజమాన్యం పక్కకు పెట్టడంతో బౌలింగ్ లో ఫేలవ ప్రదర్శన చూపుతోంది.
బ్యాటింగ్ లో కూడా అద్భుతమైన ఫామ్ లో ఉన్న ఆటగాళ్లు ఈ సీజన్ తొలి మ్యాచ్ లో తప్ప మిగతా మ్యాచ్ లలో ఆకట్టుకోలేకపోయారు. దీంతో SRH పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కాటేరమ్మ బిడ్డలు ఏమయ్యారు..? అని ప్రశ్నిస్తున్నారు. SRH కీలక బౌలర్ హర్షల్ పటేల్ ను హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారని సమాచారం. హర్షల్ పటుల్ బాడీ పెయిన్స్ తో బాధపడుతున్నట్టు సమాచారం. మరికొందరూ మాత్రం అతనికి ఫుడ్ పాయిజన్ అయిందని కూడా చెబుతున్నారు. ఆదివారం రోజు గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు మరో ఓటమి చవిచూసింది. నిన్నటి మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆటగాడు హర్సల్ పటేల్ జట్టులో ఉంటే బాగుండేదని.. అతను జట్టులో లేకపోవడం వల్ల హైదరాబాద్ ఓడిపోయిందని కొందరూ పేర్కొంటున్నారు,. గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరించింది. కంప్లీట్ గా స్లో పిచ్ కావడంతో.. హర్షల్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేస్తారు. హర్షల్ పటేల్ మ్యాచ్ లో లేకపోవడం.. పెద్ద మైనస్ అయింది.
ముఖ్యంగా 2024 సీజన్ లో దుమ్ము లేపిన హైదరాబాద్ ప్లేయర్లు.. ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలో కూడా దారుణం ఓడిపోతున్నారు. ఇవాల్టి మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయిన 152 పరుగులు చేసింది. చివర్లో సన్ రైజర్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 9 బంతుల్లోనే 22 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది హైదరాబాద్ టీమ్.