Imposter Syndrome: చిన్న విషయానికి కూడా చాలా బాధ పడిపోయే వారు చాలా మంది ఉంటారు. చేస్తున్న పనిలో చిన్న తప్పు జరిగినా విపరీతంగా అవేదన చెందుతారు. దీన్ని ఇంపోస్టర్ సిండ్రోమ్ అని పిలుస్తారట. దీని వల్ల మనిషి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్రమంగా ఇది ఒక మానసిక రుగ్మతగా కూడా మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 శాతం మందికి ఈ సమస్య ఒక్కసారైనా ఎదురై ఉంటుందని మానసిక వైద్యులు చెబుతున్నారు.
చాలా ప్రమాదకరం..
ఇంపోస్టర్ సిండ్రోమ్ అనేది చాలా ప్రమాదరకమైందని డాక్టర్లు చెబుతున్నారు. దీని వల్ల మానసిక ఆరోగ్యానికి హాని జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ మానసిక రుగ్మతతో ఇబ్బంది పడుతున్న వారిని అలాగే వదిలేస్తే రానురాను ఒత్తిడి, డిప్రెషన్ పెరిగిపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తే వెంటనే సైకాలజిస్ట్‌కు చూపించాలని సూచిస్తున్నారు.
రకాలు కూడా..
ఇంపోస్టర్ సిండ్రోమ్‌లో చాలా రకాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్కో మనిషిని బట్టి దీని లక్షణాలు వేరువేరుగా ఉంటాయట.
పర్ఫెక్షనిస్ట్ ఇంపోస్టర్ సిండ్రోమ్ ఉన్న వారు చేస్తున్న ప్రతి పని పర్ఫెక్ట్‌గా ఉండాలని అనుకుంటారట. అనుకున్నది అనుకున్నట్లుగా జరగకుంటే తీవ్రమైన మరోవేదనకు గురైపోతారు. పని పూర్తయిన తర్వాత దాని కోసం పడిన కష్టాన్ని మర్చిపోయి ఫలితం గురించే ఆలోచిస్తారట. పూర్తిగా ఫెల్యూర్ అనే భావనను మనసులో పెట్టుకుని నిరాశ చెందుతారట.
జీనియస్ ఇంపోస్టర్ సిండ్రోమ్‌తో ఇబ్బంది పడుతున్న వారు ఏ విషయం అయినా తమకు బాగా తెలుసు అనే భావనలో ఉంటారట. ఎదైనా నేర్చునేటప్పుడు త్వరగా రాకపోతే తీవ్ర అసహనానికి గురైపోతారు.
సోలోయిస్ట్ ఇంపోస్టర్ సిండ్రోమ్ అనే సమస్య ఉన్న వారు ఇతరుల సహాయం తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. ఏదైనా సొంతంగానే చేయాలి, సొంతంగానే నేర్చుకోవాలని అనుకుంటారు. ఎవరైనా సహాయం చేయడానికి వచ్చినా అంగీకరించలేరట.
ఎక్స్‌పర్ట్ ఇంపోస్టర్ సిండ్రోమ్‌తో ఇబ్బంది పడుతున్న వారు ఏదైనా చేసే ముందు ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటారట. చేయాల్సిన పనిని మొదలుపెట్టడం పక్కన పెట్టి సమాచారాన్ని సేకరించండం గురించే అతిగా సమయాన్ని వేస్ట్ చేస్తారట.
మరో రకమైన ఇంపోస్టర్ సిండ్రోమ్ ఉన్న వారు ప్రతి పనిలో విజయం సాధించాలనే కోరుకుంటారట. దీని కోసం చేయాల్సిన దాని కన్నా చాలా ఎక్కువే చేస్తారు. తీరా అనుకున్నంత స్థాయిలో ఫలితం రాకుండా నిరాశ చెందుతారు. అనుకున్నది జరగకుంటే నేను ఇంకా ఎక్కువ చేయగలను.. అని లేదా ఇది ఇంకా ఈజీగా ఉంటే బాగుండేది కదా అని తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందట.
ఇటువంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నవారిని వెంటనే థెరపిస్ట్‌కు చూపించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.