Uppal Stadium : హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ గ్రౌండ్ ఇటీవలే వివాదంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాల మధ్య ఉచిత పాస్ ల కేటాయింపు పై వివాదం నెలకొంది. అది ఇప్పుడు సద్దుమణిగింది. అయితే తాజాగా మరో వివాదం నెలకొంది. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరిగిన సమయంలో వర్షం వచ్చింది. వర్షం రావడంతో గ్రౌండ్ లో వాటర్ నిలిచిపోయింది. దీంతో ఉప్పల్ గ్రౌండ్ కంటే.. బోరబండ గల్లీలో బెటర్ అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.
Also Read : MS Dhoni Unseen Pic : రైల్వే స్టేషన్ లో పనిచేస్తున్న ధోని.. ఫోటోలు వైరల్
బెంగళూరు చిన్న స్వామి స్టేడియం తరహాలో ఇక్కడ సిస్టం లేకపోవడంతో గ్రౌండ్ మొత్తం చిత్తడి చిత్తడి అయిపోయింది. ఇటీవల ఓ మ్యాచ్ సందర్భంగా భారీ వర్షం వచ్చినప్పటికీ బెంగళూరులోని చిన్న స్టేడియం రెండు గంటలలోపే ఇంకి పోయింది. చిన్నస్వామి స్టేడియం మాదిరిగా ఉప్పల్ స్టేడియాన్ని తీర్చిదిద్దితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కాస్త ప్లస్ పాయింట్ అవుతుంది. మరోవైపు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో బాత్ రూమ్ లు, టాయిలెట్స్ కూడా నీట్ గా ఉండవని పలువురు అభిమానులు పేర్కొంటారు. హైదరాబాద్ స్టేడియంలో ఫెసిలిటీస్ అస్సలు బాగాలేవని.. టికెట్ల విషయంలో వివాదాలు జరుగుతున్నాయని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఇటీవలే హైదరాబాద్ వేదికను మార్చుకుంటామని కూడా పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కూడా వచ్చే సీజన్ లో ఏపీ నుంచి ఒక జట్టు ఉంటుందని కూడా ఒకనొక సందర్భంలో పేర్కొన్నాడు.
బెంగళూరు చిన్న స్వామి స్టేడియం మాదిరిగా ఏపీలోని విశాఖ స్టేడియానికి మెరుగులు దిద్దితే సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి విశాఖ కు సొంత మైదానంగా మారే అవకాశం కూడా కనిపిస్తుందని ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చెత్త ప్రదర్శనను కనబరుస్తోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్ లు ఆడితే.. కేవలం మూడు మ్యాచ్ ల్లోనే విజయం సాధించింది. మిగతా మ్యాచ్ లలో ఓడిపోయింది. SRH జట్టుకు ఈ సీజన్ లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగం ఫామ్ లో కొనసాగడం లేదు. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో మాత్రం బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. కానీ ఆ మ్యాచ్ లో విజయం సాధిస్తుందని భావిస్తే.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ షాక్ తగిలింది. మిగతా 3 మ్యాచ్ లు గెలిచినప్పటికీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం ప్లే ఆప్స్ కి చేరడం కాస్త కష్టమనే చెప్పాలి. గత సీజన్ లో ఫైనల్ కి వెళ్లిన జట్టు ఈ సారి ఇంత చెత్త ప్రదర్శన కనబరచడం ఏంటి..? క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోవడం విశేషం.
https://www.facebook.com/share/p/1Ak3AwZbXL/