New Ration Card: ఏపీలో నూతన రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎలా అప్లై చేయాలి? ఎటువంటి సేవలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయనే విషయాలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. అయితే అప్లై చేయాలనుకున్న వారు ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటో తెలుసుకుందాం.
మొత్తం ఆరు రకాల సేవలు
ఏపీలో నూతన రైస్ కార్డుల జారీ సంధర్భంగా మాట్లాడిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ఏపీలో రేషన్ కార్డుల జారీ కొరకు ఎన్నో కుటుంబాలు ఎదురుచూపుల్లో ఉన్నాయని, అటువంటి వారు ఇక దరఖాస్తు చేయవచ్చన్నారు. మొత్తం ఆరు రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. నూతన రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, చిరునామా మార్పు, సభ్యులను చేర్చడం, ఉన్న వారిని తొలగించండం, కార్డులను సరెండర్ చేయడం తదితర ఆరు రకాల సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.
ఎక్కడ అప్లై చేయాలి?
నూతన రేషన్ కార్డుల కొరకు అప్లై చేసేవారు తప్పక దగ్గర్లోని గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించాలి. అలాగే వారం రోజుల్లో వాట్సాప్ గవర్నెన్సు ద్వారా కూడా ఈ సేవలను పొందవచ్చు. జస్ట్ కేవలం ఒక్క క్లిక్ ద్వారా రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసే పద్దతి అందుబాటులో ఉంటుందన్నారు.
అర్హతలు ఇవేనా?
నూతన రేషన్ కార్డుకు దరఖాస్తు చేసే వారు తప్పక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండరాదు. అలాగే ఎవరైనా ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి, రేషన్ కార్డు పొంది ఉన్నట్లయితే తప్పక దానిని సరెండర్ చేయాలి. ఇక సామాన్య కుటుంబాలకు రేషన్ కార్డు అందడం ఖాయం. ఎవరైనా ప్రలోభ పెట్టి మోసం చేయాలని చూస్తే, తప్పక స్థానిక అధికారులకు సమాచారం అందించండి. అర్హత ఒక్కటే ప్రామాణికంగా నూతన రేషన్ కార్డు మీ దగ్గరికి చేరుతుంది.
Also Read: AP New Ration cards: ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుకు టైమ్ వచ్చింది
కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు?
అప్లై చేసిన అనంతరం స్థానిక అధికారుల పరిశీలన తర్వాత కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు. ఈ కార్డులు కూడా స్మార్ట్ కార్డ్ తరహా సైజును కలిగి ఉండడం విశేషం. జూన్ మాసంలో స్మార్టు కార్డుల రూపంలో నూతన రైస్ కార్డుల జారీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మరెందుకు ఆలస్యం వెంటనే, స్థానికంగా గల మీ సచివాలయానికి వెళ్లండి. మీరు అప్లై చేయండి.. అలాగే అర్హత ఉంటే తప్పక రైస్ కార్డు పొందండి.