Sunil Gavaskar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. నిన్న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (Royal Challengers Bengaluru vs Gujarat Titans, Final) మధ్య ఫైనల్స్ నిర్వహించారు. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఐదు వికెట్ల తేడాతో బిగ్ విక్టరీ అందుకుంది. ఈ క్రమంలో రెండోసారి వరుసగా ఛాంపియన్గా నిలిచింది బెంగుళూరు. మొదటి టైటిల్ కోసం 18 సంవత్సరాలు వేచి చూసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఇప్పుడు వరుసగా 2 టైటిల్స్ గెలవడం ఆ జట్టులో నూతన ఉత్సాహాన్ని నింపింది. అయితే బెంగళూరు ఛాంపియన్ అయిన నేపథ్యంలో సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అసలు ఆదివారం రోజున ఫైనల్స్ నిర్వహించకూడదని.. దానివల్ల గుజరాత్ నష్టపోతుందని సునీల్ గవాస్కర్ మొత్తుకున్నారు. అయినప్పటికీ ఆదివారం రోజున ఫైనల్స్ నిర్వహించి.. గుజరాత్ టైటాన్స్ గొంతు కోశారని ఆయన ఫైర్ అయ్యారు. రిజర్వుడే ఉన్న నేపథ్యంలో సోమవారం ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తే, బాగుండేదని ఆయన వెల్లడించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2026లో భాగంగా నిన్న ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే 29వ తేదీన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడిన గుజరాత్ టైటాన్స్… మోడీ స్టేడియానికి చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. న్యూ చండీగఢ్ లో అకాల వర్షాలు పడిన నేపథ్యంలో, విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో గుజరాత్ టైటాన్స్ న్యూ చండీగఢ్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. శనివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత మోడీ స్టేడియానికి చేరుకుంది. దీనివల్ల గుజరాతి టైటాన్స్ ప్లేయర్లకు ఎలాంటి రెస్టు, ప్రాక్టీస్ దొరకలేదు. నేరుగా ఫైనల్ మ్యాచ్ ఆదివారం రోజున ఆడారు. ఈ క్రమంలో చిత్తుగా ఓడిపోయింది గుజరాత్ టైటాన్స్.
ఫైనల్స్ లో రెస్టు లేకుండా బరిలోకి దిగినందుకు గానే గుజరాత్ టైటాన్స్ ఓడిపోయిందని ఇప్పుడు ఆ జట్టుకు సంబంధించిన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మ్యాచ్ కంటే ముందు సునీల్ గావాస్కర్ కూడా ఇదే విజయాన్ని చెప్పారు. రిజర్వుడే ఉన్న నేపథ్యంలో ఆదివారం కాకుండా సోమవారం ఫైనల్స్ నిర్వహించాలని సూచనలు చేశారు. గుజరాత్ టైటాన్స్ నిద్రలేకుండా జర్నీ చేయడం జరిగిందని.. వాళ్లకు ప్రాక్టీస్ కు సమయం ఇవ్వాలని ఆయన కోరారు. ఆదివారం రోజున హాయిగా ప్రాక్టీస్ చేసుకుని, ఫ్రెష్ గా ఫైనల్స్ ఆడి ఉంటే బాగుండేదని తెలిపారు. కానీ బీసీసీఐ మాత్రం ఆదివారమే టోర్నమెంట్ నిర్వహించి, గుజరాత్ కు షాక్ ఇచ్చింది. దీనిపై న్యాయపోరాటం చేసేందుకు గుజరాత్ టైటాన్స్ అభిమానులు కూడా రెడీ అవుతున్నారు. మళ్లీ ఫైనల్స్ నిర్వహించాల్సిందేనని… సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలను కోట్ చేస్తున్నారు.