E-Paper
Advertisement

ఆస్ట్రేలియా అమ్మాయిలకు డోపింగ్ టెస్టులు చేయాల్సిందే!

ఆస్ట్రేలియా అమ్మాయిలకు డోపింగ్ టెస్టులు చేయాల్సిందే!
Advertisement

Tanveer Ahmed:  టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (2026 Women’s T20 World Cup tournament) విజేతగా ఆస్ట్రేలియా మహిళలు జట్టు నిలిచింది. దీంతో ఏడవసారి ఛాంపియన్ గా నిలిచింది ఆస్ట్రేలియా. టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో భాగంగా ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం రోజున ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా మహిళల జట్టు… ఛాంపియన్ గా మరోసారి అవతరించింది.

Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది 

ఆస్ట్రేలియా అమ్మాయిలకు డోపింగ్ టెస్టులు చేయాల్సిందే!

Advertisement

ఆస్ట్రేలియా మహిళలు జట్టు విక్టరీ అందుకున్న నేపథ్యంలో.. పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరుసగా ట్రోఫీలు అందుకుంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్లకు డోపింగ్ టెస్ట్ లు నిర్వహించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడు సార్లు వన్డే వరల్డ్ కప్, మరో ఏడు సార్లు టి20 వరల్డ్ కప్ గెలవడం సామాన్య విషయం కాదన్నారు. ఇలా వరుసగా ఐసీసీ టోర్నమెంట్లు కొట్టడానికి పుట్టినట్లుగా ఆస్ట్రేలియా క్రికెటర్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఇలా ట్రోఫీలు గెలవడం వెనుక కుట్రకోణం ఉందని బాంబు పేల్చారు. కచ్చితంగా ఆస్ట్రేలియా క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు నిర్వహించాల్సిందేనని.. అప్పుడే అసలు విషయం బయట పడుతుందని హాట్ కామెంట్స్ చేశారు.

ఈసారి ఆస్ట్రేలియాకు వదిలేసాం.. వచ్చేసరికి పాకిస్తాన్ దే టైటిల్

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (2026 Women’s T20 World Cup tournament) నేపథ్యంలో ఆస్ట్రేలియాకు టైటిల్ వచ్చిన నేపథ్యంలో తన్వీర్ అహ్మద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈసారి ఆస్ట్రేలియాకు వదిలేశామని.. వచ్చే టైటిల్ కచ్చితంగా పాకిస్తాన్ మహిళల జట్టు కొడుతుందని శపథం చేశారు. ఆ దిశగా ఇప్పటినుంచి పాకిస్తాన్ మహిళల జట్టును ప్రిపేర్ చేస్తున్నట్లు వివరించారు. ఐసీసీ చైర్మన్ గా జై షా పదవి అప్పటి వరకు ముగుస్తుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వరుసగా పాకిస్తాన్ టైటిల్స్ దక్కించుకుంటుందని పేర్కొన్నారు. పురుషుల పాకిస్తాన్ జట్టు కూడా ఆర్థిక అడుగులు వేయాలని కోరారు. భవిష్యత్తులో టీమిండియా కు టైటిల్స్ రాకుండా చూడాలన్నారు. ఇది ఇలా ఉండగా వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఇంగ్లాండ్ మహిళల జట్టుపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆస్ట్రేలియా మహిళల జట్టు. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 150 పరుగులు సాధించింది. ఈ క్రమంలో 17.1 ఓవర్స్ లో 153 పరుగులు చేసి విజయం సాధించింది ఆస్ట్రేలియా.

Advertisement

Also Read: Tanveer Ahmed Reacts On Te am India vs England T20 Series: వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారు, లేకుంటే టీమిండియా చిత్తుగా ఓడిపోయేది(England Women vs Australia Women, Final)

Related News

Shahid Afridi : జై షా చేతిలో ట్రోఫీ అందించ‌డం క్రికెట్ కే అవ‌మానం!

వైభ‌వ్ ను అవ‌మానించిన బీసీసీఐ..చిన్న‌పిల్ల‌ల‌కు ఇచ్చే టోపీ ఇచ్చి మ‌రీ !

జాకబ్ బెథెల్ కాదు, కోహ్లీ వ‌ల్లే ఇంగ్లాండ్ గెలిచింది..గిట్టు విప్పిన నాజ‌ర్

టీమిండియా ఓడినా ప‌ర్లేదు..ఆర్చ‌ర్ కు మాత్రం న‌ర‌కం చూపించు వైభ‌వ్?

ఐర్లాండ్ సిరీస్ తోనే మా ప‌త‌నం మొద‌లైంది..శ్రేయ‌స్ షాకింగ్ కామెంట్స్‌ !

ఇవేం నో బాల్స్ రా నాయ‌నా.. 60 ప‌రుగులు ఇచ్చి నిండాముంచేసిన‌ రవి బిష్ణోయ్

ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓట‌మి.. టీమిండియా ప‌త‌నం మొద‌లైందంటూ అఫ్రిది సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×