vaibhav Sooryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ (vaibhav Sooryavanshi).. టీమిండియాలో కూడా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ టి20 సిరీస్ లో భాగంగా శనివారం మాంచెస్టర్ వేదికగా రెండో మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో సంజు శాంసన్ ను తప్పించి.. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చింది టీమిండియా యాజమాన్యం. అయితే ఈ సందర్భంగా డెబ్యూ చేసిన వైభవ్ సూర్యవంశీకి తిలక్ వర్మ చేతుల మీదుగా ఇండియన్ క్యాప్ అందించారు. అయితే, ఈ సందర్భంగా వైభవ్ కు చిన్నపిల్లలు ధరించే క్యాప్ ఇచ్చారని ట్రోలింగ్ చేస్తున్నారు. అతడి తలకు సరిగ్గా సరిపడులా బీసీసీఐ… క్యాప్ సిద్ధం చేయలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైభవ్ ను అవమానించేందుకే ఇలా చేశారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో అదరగొట్టిన వైభవ్ సూర్య వంశీకి… టీమిండియాలో అవకాశం ఇవ్వాలని చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఐర్లాండ్ సిరీస్ లో అవకాశం ఇవ్వనందుకు.. ఇంగ్లాండ్ తో అయినా ఇవ్వాలని మాజీ క్రికెటర్లు కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ ను పక్కకు పెట్టి మరి 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ కు ఛాన్స్ ఇచ్చాడు గంభీర్. ఈ నేపథ్యంలోనే టీమిండియా కు సంబంధించిన క్యాప్ ను అందించారు. అయితే ఈ క్యాప్ వైభవ్ సూర్యవంశీ తలకు అస్సలు పట్టలేదు. 15 ఏళ్ల కుర్రాడు అయినప్పటికీ.. వైభవ్ తల చాలా పెద్దగా ఉంది. ఈ క్రమంలోనే ఆ క్యాప్ వైభవ్ కు సరిగ్గా సెట్ కాలేదు. దీంతో చిన్న పిల్లలకు ఇచ్చే క్యాప్ వైభవ్ కు ఇచ్చారని బీసీసీఐపై ట్రోలింగ్ చేస్తున్నారు. వైభవ్ ను అవమానించారని దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో హీరోగా నిలిచిన సంజు శాంసన్ ( Sanju Samson) స్థానంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ కు గంభీర్ అవకాశం ఇచ్చాడు. అయితే ఇచ్చిన ఈ అవకాశాన్ని వైభవ్ సద్వినియోగం చేసుకోలేదు. పది బంతుల్లో కేవలం 14 పరుగులు చేసి వెనుతిరిగాడు. ఇందులో రెండు సిక్సర్లు ఉండడం గమనార్హం. అయితే భారీ షాట్ కోసం ప్రయత్నించి విల్ జాక్స్ బౌలింగ్ లో స్టంప్ అవుట్ అయ్యాడు.