Nasir Hussain: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (England vs India, 2nd T20I ) మధ్య టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లు ఇప్పటివరకు రెండు టీ20 లు జరిగాయి. ఇందులో ఒకటి వర్షార్పణం కాగా, మరో మ్యాచ్ శనివారం జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండు పురుషుల జట్టు 4 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కుర్ర క్రికెటర్ జాకబ్ బెథెల్ అద్భుతంగా రాణించాడు. ఒంటి చేత్తో 76 పరుగులు సాధించి.. ఇంగ్లాండ్ ను విజయ తీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో జాకబ్ బెథెల్ (Jacob Bethell) పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాజర్ హుస్సేన్ (Nasir Hussain ). టీమిండియా పై ఇంగ్లాండ్ విజయానికి కారణం జాకబ్ బెథెల్ కాదని.. విరాట్ కోహ్లీ ( Virat Kohli) అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ వల్ల టీమిండియా వీక్నెస్ లు తెలుసుకొని, శనివారం మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడని జాకబ్ బెథెల్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య శనివారం మాంచెస్టర్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 190 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో జాకబ్ బెథెల్ 76 పరుగులతో రెచ్చిపోయాడు. ముఖ్యంగా రవి బిష్ణోయ్ ఒకే ఓవర్ లో 27 పరుగులు సాధించి… బౌలర్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఓవర్ ఆల్ గా46 బంతుల్లో 76 పరుగులు చేసిన జాకబ్ బెథెల్, ఐదు సిక్సర్లతో పాటు ఐదు బౌండరీలు సాధించాడు. ఈ మ్యాచ్ లో జాకబ్ బెథెల్ అద్భుతంగా ఆడిన నేపథ్యంలో నాజర్ హుస్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంగ్లాండ్ విజయానికి విరాట్ కోహ్లీ సలహాలు ఉపయోగపడ్డాయని తెలిపారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడినప్పుడు జాకబ్ బెథెల్ ను విరాట్ కోహ్లీ బాగా ట్రైన్ చేశాడన్నారు. బెంగళూరు జట్టుకు ఉపయోగపడేలా అతడిని సిద్ధం చేసి… మ్యాచ్ విన్నర్ గా మార్చినట్లు ప్రశంసించారు. దానికి తగ్గట్టుగానే విరాట్ కోహ్లీ దగ్గర అనేక మెలుకవలు నేర్చుకున్నాడు జాకబ్. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ నాజర్ హుస్సేన్… ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ మెలుకువలు నేర్పించడం వల్ల… చేజింగ్ మాస్టర్ గా జాకబ్ బెథెల్ రాటు తేలుతున్నాడని ప్రశంసించారు. దీంతో విరాట్ కోహ్లీని దేశ ద్రోహి అంటూ ట్రోల్ చేస్తున్నారు.
Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది