Harbhajan Singh : పంజాబ్ రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రంలోని మొత్తం 23 జిల్లాలు వరదలకు ప్రభావితంగా మారాయి. ఈ వరదల్లో సుమారు 50 మందికి పైగా మృతి చెందారు. పంజాబ్ లో ఇలాంటి వరదలు సంభవించడం 1998 తరువాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఎగువన హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ భారీ వర్షాలు కురుస్తుండటంతో సట్లేజ్, బియాస్, రావి నదులు ప్రమాదకరస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో కొన్ని ఊర్లే మునిగిపోయాయి. పంజాబ్ లో కురుస్తున్న భారీ వర్షాలు.. జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చే వరదల వల్ల దాదాపు పంజాబ్ లోని 1200 గ్రామాలకు పైగా నీటమునిగిపోయినట్టు సమాచారం. దీంతో తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) వరద బాధితులకు సహాయం చేశారు.
Also Read : Rishab Pant : చిన్నపిల్లడిలా కటింగ్ చేయించుకున్న పంత్… టీమిండియాలోకి రీ ఎంట్రీ అప్పుడే..
ఇటీవల పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటాతో పాటు హేమ్కుంట్ ఫౌండేషన్ కలిసి ప్రజలకు సహాయం చేశాయి. తాజాగా హర్భజన్ సింగ్ వరద బాధితులకు సహాయం చేశాడు. ముఖ్యంగా రూ.50లక్షలు ఆర్థిక సాయం.. అలాగే 11 స్టీమర్ బోట్లు, 03 అంబులెన్స్ లు హెల్ప్ చేసేందుకు సహాయపడేలా అందించారు హర్భజన్ సింగ్. ఇలాంటి కష్ట సమయాల్లో పేద ప్రజలకు సహాయం చేసేందుకు అండగా నిలబడిన హర్భజన్ గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఆపద సమయంలో ఆదుకున్న వారే గొప్ప వ్యక్తులు అవుతారు. మంచి మనస్సు ఉండి కూడా ఆపద సమయంలో ఆదుకోని వారు గొప్ప వ్యక్తులు కాలేరు అని సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటికే పంజాబ్ లో వరద ప్రభావిత 1200 గ్రామాల్లో పంజాబ్ మంత్రులు, ఆప్ సీనియర్ నేతలు, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలు పర్యటించి సాయం చేసేందుకు ప్రకటనలు చేశారు. మరోవైపు వరదల ప్రభావంగా పెరుగుతున్న నదీ జలాల వల్ల ఎదురయ్యే తక్షణ సవాళ్లను అంచనా వేసేందుకు అక్కడి స్థానిక నాయకులు, ప్రజలతో మాట్లాడారు. ఈ మధ్య కాలంలో కేవలం పంజాబ్ రాష్ట్రంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వర్షాలకు భారీ వరదలు సంభవించడం విశేషం. ఇక ఏది ఏమైనప్పటికీ పంజాబ్ లో వరద బాధితులకు పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటా (Preity Zinta) తో పాటు హర్భజన్ సింగ్ లు సాయం చేయడం పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మంచి మనస్సు ఉంటే.. ఎలాంటి ప్రమాదం వచ్చినా సేవ్ చేయవచ్చని పొగుడుతున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం లో సెలబ్రిటీలు కొందరూ ముందుంటారు. వారిలో హర్భజన్ సింగ్ కూడా ఒకరు అని తాజాగా వరద బాధితులకు సాయం చేసి ప్రూవ్ చేసుకున్నాడు. మరోవైపు హర్భజన్ సింగ్ క్రికెట్ తో పాటు.. రియల్ గా కూడా హీరో నే అని కామెంట్స్ చేస్తున్నారు.
A NICE GESTURE BY HARBHAJAN SINGH WITH DONATION 👏
– 11 Steamer Boats.
– 3 Ambulances.
– Mobilized 50 Lakhs relief.Harbhajan Singh is standing together in tough times for Punjab. pic.twitter.com/pQBZtYq6wI
— Johns. (@CricCrazyJohns) September 8, 2025