Rishab Pant : టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ (Rishab Pant) ఇటీవల టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ 2025లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో పంత్ తొలి రోజు ఆటలో క్రిస్ వోక్స్ బౌలింగ్ లో గాయపడ్డాడు. ముఖ్యంగా వోక్స్ సంబంధించిన బంతి పంత్ పాదానికి తీవ్ర గాయం అయింది. నొప్పితో విలవిలలాడిన పంత్ అప్పుడు మైదానాన్ని వీడి, జట్టు అవసరాల దృష్ట్యా కుంటూతూనే రెండో రెండో బ్యాటింగ్ కి దిగాడు. తొలి రోజు గాయపడిన సమయానికి 37 పరుగుల వద్ద పంత్.. రెండో రోజు 17 పరుగులు జోడించాడు. ఇదిలా ఉంటే..ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్ట్ లో క్రిస్ వోక్స్ ( Chris vokes) కూడా గాయపడటం గమనార్హం. తాజాగా రిషబ్ పంత్ గురించి సోషల్ మీడియాలో తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.
Also Read : Rohit Sharma: ఆస్పత్రిలో చేరిన రోహిత్ శర్మ…ఆందోళనలో ఫ్యాన్స్..అసలు ఏమైంది
చెట్టు కింద కూర్చొని రిషబ్ పంత్ హెయిర్ స్టైల్
వాస్తవానికి రిషబ్ పంత్ (Rishabh Pant) ఓ చెట్టు కింద కూర్చొని హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు. అయితే ఆ సందర్బంలో తన చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నాడు. చిన్నప్పుడు కింద కూర్చొని కటింగ్ ఎలా చేసుకునే వాడో అని ఒక్కసారి తన హెయిర్ స్టైల్ ని గుర్తుకు చేసుకుంటూ.. చిన్న పిల్లాడిలా ఇప్పుడు చెట్టు కింద కూర్చొని కటింగ్ చేయించుకున్నాడు. అప్పుడు కుర్చి కూడా లేకుండా కింద వెంట్రుకల మధ్య కూర్చొని చిన్నప్పుడు అలాగే హెయిర్ స్టైల్ చేయించుకునేవారు. ప్రస్తుతం రిషబ్ పంత్ చెట్టు కింద కూర్చొని హెయిర్ స్టైల్ కటింగ్ చేయించుకునే ఫొటో వైరల్ అవుతోంది. మరోవైపు రిషబ్ పంత్ పాదం గాయం నుంచి పూర్తిగా కోలుకొని అక్టోబర్ లో వెస్టిండీస్ తో జరిగే హోమ్ టెస్ట్ సిరీస్ సమయానికంతా రెడీ గా ఉండాలని అనుకుంటున్నాడు. ఇందులో భాగంగానే సీఓఈలోని రీహ్యాబ్ లో చేరనున్నాడు రిషబ్ పంత్. ఒకవేళ వెస్టిండిస్ తో జరిగే వైట్-బాల్ సిరీస్ సమయానికి పూర్తిగా కోలుకోకపోతే.. ఆ తరువాత ఆస్ట్రేలియా తో జరిగే వైట్ బాల్ సిరీస్ సమయానికి పునరాగమనం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం.
మరోవైపు పంత్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ చేశాడు. గతంలో ఎంత బాధను అనుభవించినా.. మళ్లీ గాయపడితే అదే స్థాయిలో బాధ కలుగుతుంది. అయితే రెండోసారి మన సహన శక్తి పెరుగుతుంది. అలాగే మనల్ని బలంగా మారుస్తుందని తన ఇన్ స్ట గ్రామ్ ఖాతాలో రాసుకొచ్చాడు. ఇంగ్లాండ్ లో గాయపడటం కంటే ముందు రిషబ్ పంత్ 2022లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన విషయం తెలిసిందే. అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆ స్థాయి గాయాలు కాకపోయినా పంత్ మరోసారి గాయపడ్డాడు. ఫలితంగా మరోసారి జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం భారత టీ-20 జట్టు ఆసియా కప్ కోసం యూఏఈలో పర్యటిస్తోంది. ఈ జట్టులో వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, జితేశ్ శర్మ ఎంపికయ్యారు.