Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో.. ముంబై ఇండియన్స్ జట్టుకు ( Mumbai Indians ) వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముంబై ఇండియన్స్ జట్టును గాయాలు వరుసగా వేధించడం జరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్లేయర్లు.. గాయం కారణంగా దూరం కావడంతో… మరో ఇద్దరు ప్లేయర్లు కూడా దూరమవుతున్నాడు. ఐపిఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ముంబై ఇండియన్స్ ఆడే మొదటి మ్యాచ్ కు… ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) అలాగే డేంజర్ ప్లేయర్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) దూరం కాబోతున్నారు.
Also Read: IPL 2025: ఐపీఎల్ లో బుమ్రా చెత్త రికార్డ్..No-Balls లో రికార్డు ?
గత సీజన్ లో పెనాల్టీ కారణంగా… హార్దిక్ పాండ్యా… ఈ టోర్నమెంట్ లో మొదటి మ్యాచ్ కు దూరమవుతున్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్య కుమార్ యాదవ్ ( Surya Kumar Yadav) కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వబోతున్నారు. అలాగే ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah)… ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. జస్‌ప్రీత్ బుమ్రా కోలుకోవాలంటే చాలా టైం పడుతుంది. మరో 10 రోజుల వరకు…జస్‌ప్రీత్ బుమ్రా కోలుకునే ఛాన్స్ ఉందట. అంటే ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో ముంబై ఇండియన్స్ ఆడే… మొదటి మ్యాచ్ తో పాటు మరో మూడు నుంచి నాలుగు మ్యాచ్ లకు దూరమయ్యే ప్రమాదం ఉంది జస్‌ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా గడ్డ పైన జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-2025 టోర్నమెంటు ( Border Gavaskar Trophy 2024-2025 Tournament ) సమయంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) గాయపడ్డాడు. దీంతో చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు ( Champions Trophy 2025 tournament) కూడా జస్‌ప్రీత్ బుమ్రా తీసుకోలేదు. అయితే ఈ గాయం నుంచి కోలుకునేందుకు.. ప్రస్తుతం జస్‌ప్రీత్ బుమ్రా చికిత్స తీసుకుంటున్నాడు. మరో 10 రోజుల్లో గ్రౌండ్ లో జస్‌ప్రీత్ బుమ్రా అడుగుపెట్టే ఛాన్స్ ఉంది.
Also Read: IPL 2025: ఉప్పల్ స్టేడియం లోకి వెళ్లే వారికి అలర్ట్.. ఈ వస్తువులు తీసుకుపోతే చర్యలు తప్పవు!?
ఇది ఇలా ఉండగా.. ఐపిఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య.. ఆదివారం రోజున మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్…ఈ మ్యాచ్ ఆడనుంది. రోహిత్ శర్మ లాంటి సీనియర్లు ఉన్నప్పటికీ సూర్య కుమార్ యాదవ్ కు కెప్టెన్సీ ఇచ్చింది ముంబై యాజమాన్యం. అయితే ఈ ఒక్క మ్యాచ్ తర్వాత హార్థిక్ పాండ్యా మళ్లీ జట్టులో చేరుతాడు. ఆ తర్వాత ఎప్పటి లాగే ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా కొనసాగుతాడు. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… మొదటి మ్యాచ్ కోల్ కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది.