IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament
) అతి త్వరలోనే ప్రారంభం కానుంది. మరో రెండు రోజుల్లో అంటే ఎల్లుండి… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఐపీఎల్ యాజమాన్యం. మార్చి 22వ తేదీ నుంచి… మే 25వ తేదీ వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కొనసాగుతుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా మొదట కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫైట్ ఉండనుంది. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ రెండు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో… సోషల్ మీడియాలో రకరకాల రికార్డులు వైరల్ అవుతున్నాయి.
Also Read: IPL 2025: ఉప్పల్ స్టేడియం లోకి వెళ్లే వారికి అలర్ట్.. ఈ వస్తువులు తీసుకుపోతే చర్యలు తప్పవు!?
గతంలో ప్లేయర్లు ఆడి.. సాధించిన రికార్డులు కూడా.. తెరపైకి వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఐపిఎల్ హిస్టరీలో… ఎక్కువ నో బాల్స్ వేసిన ప్లేయర్ల లిస్ట్ కూడా వైరల్ అయింది. ఈ లిస్టులో… ముంబై ఇండియన్స్ డేంజర్ ఆటగాడు జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) పేరు ఉండటం గమనార్హం. నో బాల్స్ వేసిన హిస్టరీలో.. మొదటి స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఉన్నాడు. ఇప్పటి వరకు 133 ఇన్నింగ్స్ లు ఆడాడు జస్‌ప్రీత్ బుమ్రా. ఇందులో 32 నో బాల్స్ వేయడం జరిగింది. దీంతో జస్‌ప్రీత్ బుమ్రా… టాప్ టెన్ లిస్టులో మొదటి స్థానంలో నిలిచాడు. నెంబర్ వన్ బౌలర్ గా నిలిచిన జస్‌ప్రీత్ బుమ్రా….. ఇలా నోబాల్స్ వేయడం… కూడా రికార్డ్ అని చెబుతున్నారు. ఇక జస్‌ప్రీత్ బుమ్రా తర్వాత రెండో స్థానంలో ఉమేష్ యాదవ్ ఉన్నాడు. ఇప్పటి వరకు ఐపిఎల్ హిస్టరీలో 147 మ్యాచులు ఆడాడు ఉమేష్ యాదవ్.
ఇందులో 24 నో బాల్స్ వేయడం జరిగింది దింతో రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు ఉమేష్ యాదవ్. ఆ తర్వాత శ్రీశాంత్ మూడో స్థానంలో ఉన్నాడు. 44 ఇన్నింగ్స్ లలో… శ్రీకాంత్ 23 నో బాల్స్ వేయడం జరిగింది. ఆ తర్వాత మరో టీమ్ ఇండియా ఆటగాడు.. ఇశాంత్ శర్మ ఉన్నాడు. ఇప్పటివరకు 110 ఇన్నింగ్స్ లలో కిషన్ శర్మ 23 నో బాల్స్ వేశాడు. ఆ తర్వాత టీమ్ ఇండియా స్పిన్నర్ అమిత్ మిశ్రా ఉన్నాడు. 162 ఇన్నింగ్స్ లలో 21 నో బాల్స్ వేసాడు అమిత్ మిశ్రా. ఇక ఆ తర్వాత లసిత్ మలింగ 122 ఇన్నింగ్స్లలో 18 నో బాల్స్ వేశాడు. హర్షల్ పటేల్ 13 ఇన్నింగ్స్ లలో 17 నో బాల్స్ వేయడం జరిగింది. ఆ తర్వాత ప్రసిద్ద్ కృష్ణ 51 మ్యాచ్లలో 17 నోబెల్స్ వేశాడు. తొమ్మిదో స్థానంలో అశోక్ దిందా ఉన్నాడు. ఇతను 75 నిమిషాలలో 14 నోబాల్స్ వేయడం జరిగింది. చివరగా బ్రేట్ లీ 38 నిమిషాలలో 13 నోబాల్స్ వేశాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక నో-బాల్స్ సాధించిన టాప్ 10 బౌలర్లు.
32 – జస్ప్రీత్ బుమ్రా (133 )
24 – ఉమేష్ యాదవ్ (147 )
23 – ఎస్ శ్రీశాంత్ (44 )
23 – ఇషాంత్ శర్మ (110 )
21 – అమిత్ మిశ్రా (162 )
18 – లసిత్ మలింగ (122 )
17 – హర్షల్ పటేల్ (103 )
17 – ప్రసిద్ధ్ కృష్ణ (51 )
14 – అశోక్ దిండా (75 )
13 – బ్రెట్ లీ (38 )