BigTV English

IPL 2025: ఉప్పల్ స్టేడియం లోకి వెళ్లే వారికి అలర్ట్.. ఈ వస్తువులు తీసుకుపోతే చర్యలు తప్పవు!?

IPL 2025: ఉప్పల్ స్టేడియం లోకి వెళ్లే వారికి అలర్ట్.. ఈ వస్తువులు తీసుకుపోతే చర్యలు తప్పవు!?

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025  ( Indian Premier League 2025 ) మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. విదేశీ ప్లేయర్లు కూడా తమ తమ జట్టల్లో… చేరిపోయి ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని… అన్ని జట్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఐపీఎల్ మెగా వేలం 2025 ఇటీవల జరిగిన నేపథ్యంలో…. అన్ని జట్లలో కొత్త ప్లేయర్లు వచ్చారు. కెప్టెన్లు కూడా పూర్తిగా మారిపోయారు. ఈ సారి 9 మంది టీమిండియా కు సంబంధించిన ప్లేయర్లు… 9 ఫ్రాంచైజీలకు కెప్టెన్ గా ఉన్నారు.


Also Read:  yuzi chahal: చాహల్ కు షాక్.. ధనశ్రీ వర్మ కు కోట్లల్లో భరణం.. ఎంత అంటే?

ఒకే ఒక్క విదేశీ కెప్టెన్ మాత్రం… ఈసారి టోర్నమెంట్లో కొనసాగుతున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా పాట్ కమిన్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్యాట్ కమిన్స్ ఒక్కడే ఆస్ట్రేలియాకు చెందినవాడు. అయితే… ఈ మెగా టోర్నమెంట్ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. మే 25వ తేదీ వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కొనసాగనుంది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో… మొదటి మ్యాచ్… కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉండనుంది.


ఇక రెండవ మ్యాచ్ ఆదివారం జరుగుతుంది. మార్చి 23వ తేదీన సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య… బిగ్ ఫైట్ ఉండనుంది. సన్రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ హైదరాబాదులోని ఉప్పల్ వేదికగా జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయింది.హైదరాబాద్… ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో… హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ చూసే అభిమానులకు హైదరాబాద్ పోలీసులు… కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలోనే స్టేడియం లోకి…. తీసుకువచ్చే వస్తువుల పైన ఆంక్షలు విధించారు. ఏ వస్తువు పడితే ఆ వస్తువు తేకూడదని… హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్ పోలీసులు. ముఖ్యంగా కెమెరాలు అలాగే రికార్డింగ్ పరికరాలు… ఉప్పల్ స్టేడియం లోకి తీసుకు రాకూడదని… హైదరాబాద్ పోలీసులు ఆదేశించారు.

Also Read:  BCCI: అన్ని మూసుకొని ఫాలో కావాల్సిందే… కోహ్లీ దంపతులకు బీసీసీఐ కౌంటర్?

బ్లూటూత్ హెడ్ ఫోన్స్, ఎయిర్ పాడ్స్, సిగరెట్, అగ్గిపెట్టె అలాగే కత్తులు, గన్స్, వాటర్, ఆల్కహాల్ బాటిళ్లు.. తీసుకురాకూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పెట్స్, తినుబండారాలు , బ్యాగ్స్, ల్యాప్ టాప్స్, సెల్ఫీ స్టిక్స్, హెల్మెట్, బైనాక్యులర్… టపాసులు అలాగే డ్రగ్స్ అసలు తీసుకు రాకూడదని కూడా పేర్కొన్నారు హైదరాబాద్ పోలీసులు. ఒకవేళ వీటిని స్టేడియం లోకి తీసుకువస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Uppal Rules These Are Not Allowed : 

కెమెరాలు, రికార్డింగ్ పరికరాలు, బ్లూటూత్ హెడ్ ఫోన్స్, ఎయిర్ పాడ్స్, సిగరెట్, అగ్గిపెట్టె అలాగే కత్తులు, గన్స్, వాటర్, ఆల్కహాల్, బాటిళ్లు, పెట్స్, తినుబండారాలు , బ్యాగ్స్, ల్యాప్ టాప్స్, సెల్ఫీ స్టిక్స్, హెల్మెట్, బైనాక్యులర్… టపాసులు అలాగే డ్రగ్స్.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×