BigTV English

T20I: కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్.. ఇండియా టీం ఇదే

T20I: కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్.. ఇండియా టీం ఇదే

Suryakumar Yadav: శ్రీలంక టూర్‌కు సంబంధించి టీ20 టీమ్‌ను ఇండియా గురువారం ప్రకటించింది. జట్టు కూర్పులో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. T20I కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను ప్రకటించింది. హార్దిక్ పాండ్యాకు మొండిచేయి చూపింది. దీంతో టీ20 టీమ్‌కు కెప్టెన్‌గా ఇక నుంచి రోహిత్ శర్మ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు చేపడతారు.


రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నప్పుడు వైస్ కెప్టెన్‌గా హార్దిక పాండ్యా కొనసాగారు. 2023లో టీ20 టీమ్‌కు పాండ్యానే కెప్టెన్‌గా వ్యవహరించారు. రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్ పాండ్యాకే అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. ఆశ్చర్యకరంగా ఆయనకు కెప్టెన్సీ ఇవ్వకపోవడమే కాదు.. వైస్ కెప్టెన్సీగానూ బాధ్యతలు తొలగించారు.

శ్రీలంక టూర్‌కు రోహిత్ శర్మ రానని చెప్పడంతో కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్ పాండ్యాకు ఇవ్వాలా? సూర్య కుమార్ యాదవ్‌కు ఇవ్వాలా? అనే మీమాంస జరిగింది. కానీ, హార్దిక పాండ్యా తరుచూ ఫామ్ కోల్పోతున్నారని, ఎక్కువ సమయాన్ని కేటాయించడం లేదని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. సీనియర్లు ఈ టూర్‌కు రావాలనే పిలుపు మేరకు రోహిత్ శర్మ అంగీకరించడంతో కెప్టెన్సీపై మళ్లీ మల్లాగుల్లాలు జరిగాయి. ఎట్టకేలకు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్ వైపే మొగ్గుచూపినట్టు తెలుస్తున్నది.


సూర్యకుమార్ యాదవ్ కేవలం ఏడు మ్యాచ్‌లకు మాత్రమే ఇంచార్జీగా వ్యవహరించారు. అందులో ఐదు టీ20లు ఇండియా గెలిచింది. ఈ మ్యాచ్‌లలో సూర్యకుమార్ యాదవ్ 300 పరుగులు సాధించారు. కెప్టెన్సీగా బాధ్యతలు ఇచ్చినప్పుడుల్లా సూర్యకుమార్ యాదవ్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. కెప్టెన్సీగా వ్యవహరించిన మ్యాచ్‌లలో ఆయన రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సాధించారు.

ఇండియా స్క్వాడ్ ఇదే

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మొహమ్మద్ సిరాజ్‌లు శ్రీలంక టూర్ టీ20 టీమ్‌లో ఉన్నారు.

Also Read: వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే ప్రమాదం తప్పినట్లే..

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్సీగా ఎంచుకున్నారు. రియాన్ పరాగ్ టీ20 టీమ్‌లో మళ్లీ చోటుసంపాదించుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మకు ఈ టీమ్‌లో చోటు దక్కలేదు.

శ్రీలంకలో ఈ నెల 27 నుంచి 30వ తేదీల మధ్య మూడు టీ20లు జరగనున్నాయి. ఆగస్టు 2వ తేదీ నుంచి కొలంబోలో వన్డే మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.

Related News

Salman Khan IPL Team RCB : జట్టును కొనబోతున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్?

Dewald Brevis : డెవాల్డ్ బ్రెవిస్ ఊచకోత.. ఏకంగా 8 సిక్స్ లతో రచ్చ..CSK ఇక తిరుగులేదు

Subhman-Anjini : టీమిండియా క్రికెటర్ తో అందాల తార ఎఫైర్… పబ్బులో అడ్డంగా దొరికిపోయారుగా

India Asia Cup Squad: ఆసియా కప్ కోసం 4 గురు ఆల్ రౌండర్లు, 6 గురు బౌలర్లు.. టీమ్ ఇండియా ఫుల్ స్క్వాడ్ ఇదే !

Dhoni – Abhishek : ఖాతాదారులకు భారీ మోసం.. ధోనికి 6 కోట్లు ఇస్తున్న SBI?

Priya Saroj: రింకూ సింగ్ కు కాబోయే భార్య ఢిల్లీ గడ్డపై ఎలా రెచ్చిపోయిందో చూడండి

Big Stories

×